కోవిడ్-19 మొదటి వేవ్ లో చాలా మంది భయపడ్డారు. కనిపించని శత్రువుతో పారాటం ఎలా ? అని ఆందోళన చెందారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో ప్రభావం తక్కువగా ఉండింది. మరణాలు తక్కువే. అయితే మొదటి వేన్ నుంచి రెండో వేవ్ మధ్య కాలంలో చాలా మంది భారతీయులు చాలా నింపాదిగా వ్యవహరించారు. దీంతో భారీ మూల్యం చెల్లించింది. అధికారిక లెఖ్ఖల ప్రకారమే లక్షలాది మంది కరోనా కారణంగా చనిపోయారు. దేశంలో కోవిడ్-ొ9 ప్రభావం తగ్గిన నేపథ్యంలో గత కొంత కాలంగా ప్రభుత్వం కరోనా నిబంధనలను క్రమేపీ సడలించింది. వాతావరణం పూర్వస్థితికి వస్తున్నసమయంలో కరోనా నూతన వేరియంట్ ఒమిక్రాన్ తాను ఇంకా ఉన్నానంటూ సంకేతాలు ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే ఓమిక్రాన్ కేసుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. మరణాలు కూడా నమోదవుతున్నాయి.
దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా నిబంధనలను కఠినం చేశాయి. కర్ణాటక రాష్ట్రం ఏకంగా రాత్రి వేళ కర్ఫ్యూ నే అమలు చేస్తోంది. అయితే చాలా రాష్ట్రాలు ఈ కోవిడ్ నిబంధనలను అమలు చేయడం లేదు. ముఖ్యంగా తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కేరళ, గోవా, ఒడిశా రాష్ట్రాలు కొవిడ్ నిబందనలు పాటించడం లేదనే వార్తలు వెలువడుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలతో పాటు, పండుగలు కూడా రానుండటంతో జనం అంతా మార్కెట్ల మీద పడ్డారు. ఫలితంగా ఇండియన్ మార్కెట్లు జనసమూహాలతో కళకళ లాడుతున్నాయి. ఏ ఒక్కరూ మాస్క్ ధరించటం లేదు. భౌతిక దూరం అసలే లేదు. తెలుగు రాష్ట్రాలలతో పెద్ద పండుగ ముందే వచ్చిందా ? అన్నట్లు జన సందోహంతో ఉన్నాయి. ప్రస్తుతం ఓమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉందని, మరి కొద్ది రోజుల తరువాత దీని ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడే షాపింగ్ పనులు పూర్తి చేస్తున్నామని కొనుగోలుదారులు పేర్కోంటున్నారు.
తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఇలా ఉంటే, తీర ప్రాంత రాష్ట్రమైన గోవాలో పరిస్థితి మరో రకంగా ఉంది. అక్కడి బీచ్‌లు, ఆఫ్‌షోర్ కాసినో సెంటర్ లు, పర్యాటక కేంద్రాలు కిటకిట లాడుతున్నాయి. హోటళ్లు దాదాపు 90% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి, ప్రతి నిత్యం దాదాపు 90 విమానాలు పశ్చిమ రాష్ట్రంలో ల్యాండింగ్ అవుతున్నాయి, ఎయిర్ ట్రాఫిక్ వాల్యూమ్‌లను మహమ్మారికి ముందు స్థాయికి నెట్టివేస్తున్నట్లుగా అక్కడి పరిస్థితులున్నాయి. పరిస్థితి అలాగే కొనసాగితే భారత్ మరో మారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్య రంగ నిపుణులు పేర్కోంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి