ప్రస్తుతం చైనా నుండి చాలా చౌకగా దిగుమతి అవుతున్నవటువంటి కొన్ని ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాలను విధించి షాక్ ఇచ్చింది భారత్. స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండటానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. సీబీఐసీ నోటిఫికేషన్ ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సుంకాన్ని విధించిన వస్తువుల్లో హైడ్రోఫ్లోరో కార్బన్, సోడియం హైడ్రో సల్ఫేట్ (డై పరిశ్రమలో వినియోగిస్తారు), అల్యూమినియం, సిలికాన్ సీలెంట్(సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్, హైడ్రో ఫ్లోరో కార్బన్ మిశ్రమాలు, థర్మల్ పవర్ అప్లికేషన్ తయారీ కోసం వాడుతారు), కాంపొనెంట్ ఆర్-32, వంటి వాటికి ఈ షరతులు వర్తిస్తాయి.
వాణిజ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటిఆర్) సిఫార్సుల ఆధ్వర్యంలో ఈ సుంకాలను నిర్ణయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకటించిన రోజు నుండి 5 సంవత్సరాల పాటు అమలులో ఉండనున్నాయి. అంతే కాకుండా కొత్తగా విధించిన ఈ సుంకాన్ని ఇండియా కరెన్సీలో చెల్లించాలని స్పష్టం చేసింది సీబీఐసీ. ఇలా మరోసారి చైనాకు పిడుగులాంటి వార్తను వినిపించింది భారత్. మరి దీనికి డ్రాగన్ కంట్రీ చైనా ఏ విధంగా స్పందించనుందో తెలియాల్సి ఉంది...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి