
అయినా కృష్ణా జిల్లా అనే పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు కొడాలి నానిదే. ఇక ఇక్కడ ఆయన వన్ మ్యాన్ షో నడుస్తోంది. ఆ తర్వాత పేర్ని నాని హైలైట్ అవుతారు. ఇక మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం బాగానే కనిపిస్తారు. ఈ ముగ్గురు మంత్రులని పక్కనబెడితే ఎమ్మెల్యేల్లో టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ బాగా హైలైట్ అవుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబుపై ఆయన ఏ రేంజ్లో ఫైర్ అవుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అలాగే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా ఫైర్ బ్రాండ్ నాయకుడు అనే సంగతి తెలిసిందే. ఈయన కూడా దూకుడుగా ఉన్నారు.
ఇక జిల్లాలో ఇంకా కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు గానీ...వారు ఎక్కువగా హైలైట్ అవ్వడం లేదు. సామినేని ఉదయభాను, పార్థసారథి, మల్లాది విష్ణు, మేకా ప్రతాప్, రక్షణనిధిలు సీనియర్ ఎమ్మెల్యేలు. వీరు అంతగా రాష్ట్ర స్థాయిలో హైలైట్ కావడం లేదు. అయితే వీరిలో కొందరు మంత్రి పదవుల కోసం ట్రై చేస్తున్నారు. మరి మంత్రి పదవులు వచ్చాక బయటకొస్తారేమో.
తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి గురించి ఇంకా చెప్పుకోవాల్సిన పని లేదు. కొద్దో గొప్ప వసంత కృష్ణప్రసాద్ జనాలకు తెలుస్తున్నారు గానీ, మిగిలిన ఎమ్మెల్యేలు జిల్లా స్థాయిలోనే సరిగ్గా తెలియదు. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారిని ఫలానా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. ఆ కేటగిరీలో సింహాద్రి రమేష్, కైలా అనిల్, మొండితోక జగన్, దూలం నాగేశ్వరావులు ఉన్నారు.