వనమా రాఘవ.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు.. ఇటీవల ఓ పండంటి కుటుంబం పెట్రోల్‌ పోసుకుని తగలబడిపోవడానికి మూల కారకుడు.. ఈ విషయం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికే వనమా రాఘవను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. పెట్రోల్‌ పోసుకుని తగలబడిన రామకృష్ణ.. అంతకుముందు సెల్ఫీ వీడియోలు రికార్డు చేశారు. మరి అవి ఎలా బయటకు వచ్చాయి.. అలా వచ్చేందుకు ఆయన ఏం జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు వనమా రాఘవ రిమాండ్‌ రిపోర్ట్‌లో ఏ అంశాలు బయటపెట్టారు.. ఇప్పుడు చూద్దాం..


ఆత్మహత్యకు ముందు రామకృష్ణ మొత్తం 36 నిమిషాల సెల్ఫీ వీడియోలు రికార్డు చేశారు. తన సెల్ఫోన్‌ను తన కారు డ్యాష్‌ బోర్డులో భద్రపరిచారు. ఆ విషయాన్ని మిత్రునికి వాయిస్ మెస్సేజ్‌ పంపారు. ఇప్పుపడు పోలీసులు ఆ వాయిస్ మెస్సేజ్‌ ఆధారంగానే సెల్ఫీ వీడియోలు ఇతర ఆధారాలు సేకరించారు. తనను క్షమించాలని.. తాను ఒక వీడియో చేసి పెట్టానని.. తన కార్‌ డ్యాష్‌ బోర్డులో ఉందని.. తన ఫోన్‌ కీ 7474 అన్‌లాక్‌ చేసి వీడియోను అందరికీ పంపాలని రామకృష్ణ మిత్రుడిని వాయిస్ మెస్సేజ్‌ చేశారు. తన కారు తాళం బాత్‌రూం పైన ఉందని.. ఈ విషయం నీకు మాత్రమే చెబుతున్నానని కూడా వాయిస్ మెస్సేజ్‌ లో తెలిపారు.


మెస్సేజ్‌ అందుకున్న మిత్రుడు.. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. వారు కారులోని ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విషయాలన్నీ రిమాండ్ రిపోర్డ్‌లో పేర్కొన్నారు. మొతతం ఏడు పేజీల రిమాండ్‌ రిపోర్టు రూపొందించిన పోలీసులు దాన్ని న్యాయస్థానంలో సమర్పించారు.


రాఘవ కుటుంబం సహా ఆత్మహత్యకు ప్రధాన కారణం వనమా రాఘవ, తల్లి మండిగ సూర్యవతి, సోదరి కొమ్మిశెట్టి మాధవిలేనని బాధితుడు నాగ రామకృష్ణ సుసైడ్‌ లెటర్‌లో కూడా రాశాడని రిమాండ్ రిపోర్ట్‌లో రాశారు. రామకృష్ణ బావమరిది ఫిర్యాదు ఆధారంగా 302, 307, 306, ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: