దేశ రాజ‌కీయాల్లో కీలకంగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. దీంతో ఎలాగైన మ‌రోసారి అధికారం చేప‌ట్టాల‌నుకుంటున్న కాషాయ పార్టీకి వ‌ల‌స‌ల రాజ‌కీయం తూట్లు పొడుస్తోంది. వ‌రుస‌పెట్టి  మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని వీడుతున్నారు. నిన్న స్వామి ప్ర‌సాద్ మౌర్యం, నేడు తారాసింగ్ కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్ర‌మంలో మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు రాజీనామా బాట ప‌డుతున్నారు. వీళ్లంతా యూపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న ఎస్పీ వైపు మ‌ళ్లుతున్నారు. అస‌లు అధికారంలో ఉన్న బీజేపీన వీడి ఎస్పీలో ఎందుకు చేరుతున్నార‌న్న చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. దీంతో యూపీలో కాషాయ పార్టీకి క‌ష్టాలు త‌ప్ప‌వా అన్న ప్ర‌శ్న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.


   కీలక సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు పార్టీ వీడుతుండ‌డం క‌మ‌లానికి క‌ల‌వ‌ర పెడుతోంది. మ‌రోవైపు స్వాగతం అంటూ స‌మాజ్ వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ బీజేపీ నేత‌ల‌కు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. యూపీలో క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న  స్వామి ప్ర‌సాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్  బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో చేరారు. తూర్పు యూపీలో బ‌లంగా ఉన్న ఓబీసీ నేత దారా సింగ్ యోగి క్యాబినెట్‌లో ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ శాఖా మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 2015 లో బీఎస్పీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కాష‌యా కండువా క‌ప్పుకున్న‌ దారాసింగ్ ఇప్పుడు బీజేపీని వీడారు.


  అంత‌కుముందు స్వామి ప్రసాద్ క‌మ‌లం పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ మునిగిపోయే నావ అని మ‌రింత మంది కాషాయ పార్టీని వీడుతార‌ని బాంబ్ పేల్చారు. యోగీ క్యాబినెట్‌లో ఉప ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసినా మౌర్య.. త‌న రాజీనామా అనంత‌రం యూపీ బీజేపీలో తుఫాన్ వ‌స్తుంద‌న్నారు. స్వామి ప్రసాద్ మౌర్య‌, దారాసింగ్ చౌహాన్ దారిలోనే ప‌లువురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేశారు.  మ‌రికొంత మంది మినిస్ట‌ర్‌లు కూడా కాషాయ పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నార‌నే ప్ర‌చారం కూడా న‌డుస్తోంది.



 అయితే, క‌మ‌లం పార్టీకి బై చెబుతున్న నేత‌లంతా ఎస్పీ అధినేత‌ అఖిలేష్ యాద‌వ్‌కు హాయ్ చెబుతున్నారు. దీంతో కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో బీజేపీకి పెద్ద ఝ‌ల‌క్ త‌గ‌ల‌బోతుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్తం అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: