ఆంధ్ర ప్రదేశ్ బీజేపీలో వర్గ పోరు జోరందుకుంది. రెండు రకాల నేతలు కూడా బీజేపీ పార్టీలో ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారనే సమాచారం వినిపిస్తోంది.ఇక వీరిలో.. ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చి పార్టీలో బాగా చక్రం తిప్పుతున్నవారు ఒకవర్గంగా ఉన్నారు. వీరు పార్టీకి శాశ్వతమైన నాయకులుగా మారి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కానీ వీరు మాత్రం శాశ్వతంగానే ఉన్నారు. అంతేకాదు.. పదవులు ఏమి ఆశించకుండా కూడా పనులు చేయడం వీరికే సొంతం. ఇక మరోవర్గం ఏమిటంటే ఇటీవల కొన్ని పార్టీ ల నుంచి వచ్చి చేరిన నేతలు. ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నవారిలో దాదాపు రెండు మూడు పార్టీల నాయకులు కూడా ఉన్నారు. వీరు అవసరార్థం వ్యవహరించే నాయకులని ఆర్ ఎస్ ఎస్ వాదులైన బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా కానీ వారు వెంటనే.. జంప్ జిలాని లా చేస్తారని ఎటు గాలివీస్తే.. అటు ఆ నాయకుల పయనం ఉంటుందని వారు అంటున్నారు. దీంతో వీరి హవా కొనసాగించరాదనే పట్టుదలతో కూడా ఒక వర్గం అనేది ఉంది.

కానీ.. ఈ పార్టీకి మంచి అభివృద్ధి కోసం.. లేదా.. ఈ పార్టీని గట్టిగా నిలబెట్టడం కోసం అధిష్టానం అనేది కొన్ని విషయాల్లో రాజీ పడింది. నిన్నమొన్నటి వరకు కూడా ఆర్ ఎస్ ఎస్ వాదులైన బీజేపీ నేతలు ఒకింత దూకుడుగా ఉంటే.. ఈ పార్టీ బాగుండేదని మేం వచ్చాకే పార్టీలో మాంచి జోష్ వచ్చిందని ఈ జంపింగ్ నేతలు అంటున్నారు. కనీసం పార్టీ కోసం అయినా ముందుకు వచ్చి మీడియాతో అయినా.. తమ గళం వినిపించింది లేదని వారిపై బాగా విరుచుకుపడుతున్నారు. ఒక్క బద్వేల్ ఎన్నికలో మాత్రం ఒకింత సాయం చేశారని అనుకున్నా.. కాని అది కూడా తమ తమ పరిధిలోనే చేశారని ఈ పార్టీలోనే గుసగుస అనేది వినిపిస్తోంది.

ఇక అసలు నేతలు విషయానికి వస్తే మాత్రం వారు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.అలాగే కొన్ని సార్లు.. మౌనంగా ఉన్నా కానీ.. కీలక విషయాల్లో.. మాత్రం ఆంధ్రప్రదేశ్ సర్కారును వ్యూహాత్మకంగా ఇరుకున నెట్టడం అనేది జరిగింది. ఇక అంతర్వేది రామతీర్థం వంటి ఘటనలు విజయవాడ దుర్గమ్మ ఆలయానికి చెందిన వెండి సింహాలు మాయం అంటూ ఇలా అనేక విసయాల్లో యాక్టివ్గానే ఉన్నా.. మధ్యలో మాత్రం కొంత మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు జంపింగ్ నేతల విషయానికి వస్తే.. వారు మాత్రం బాగా రెచ్చి పోతున్నారు. షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్రభుత్వంపై పోరు చేస్తామని..వారు తేల్చి చెబుతున్నారు. మరి దీనికి కారణమేంటి? అంటే.. బీజేపీ పార్టీ నేతల మధ్య కనిపిస్తున్న వర్గ విభజన రేఖేనని అంటున్నారు ఆ పరిశీలకులు.ఇక పాతనీటి కంటే కూడా కొత్తనీటి ప్రవాహానికి బాగా దూకుడు ఎక్కువనే విషయాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు వారు. దీంతో బీజేపీ పార్టీలో వర్గ పోరు జోరుగా సాగుతుండడం అనేది గమనార్హం.ఇక ఇలా అయితే..బీజేపీ పార్టీ విస్తరించేనా..? ఇంకా అధికారంలోకి వచ్చేనా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp