కొడంగల్ నియోజకవర్గం అంటే రేవంత్ రెడ్డి అడ్డా అనే సంగతి అందరికీ తెలిసిందే..అయితే ఇది 2018 ఎన్నికల ముందు వరకే...ఆ తర్వాత నుంచి కొడంగల్‌లో కారు హవా నడుస్తున్న విషయం తెలిసిందే. అనూహ్యాంగా కొడంగల్ బరిలో రేవంత్‌ని ఓడించి టీఆర్ఎస్ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక కొడంగల్‌లో రేవంత్‌కు చెక్ పెట్టడానికి కారు పార్టీ ఎన్ని వ్యూహాలు అమలు చేసింది...ఎన్ని రకలుగా ఓటర్లని ఆకర్షించిందో అందరికీ తెలిసిందే. సరే ఎలాగైతే ఏముంది రేవంత్ అడ్డాలో కారు హవా నడిచింది..టీఆర్ఎస్‌ని పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు.

సరే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది...అంతకముందు వరకు రేవంత్ గెలిచినా సరే, ప్రతిపక్షంలోనే ఉన్నారు...దీంతో కొండగల్‌లో అనుకున్న మేర పనులు జరగలేదు...మరి 2018లో అంటే కొడంగల్‌లో గెలిచింది టీఆర్ఎస్, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్, దీంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అంతా అనుకున్నారు...పరుగులు పెట్టడం పక్కన పెడితే...అధికార పార్టీ నేతల దెబ్బకు ప్రజలే పరుగెత్తే పరిస్తితి వచ్చిందని తెలుస్తోంది. ఎక్కడ చూసిన అధికార నేతల దందాలు, అక్రమాలు పెరిగిపోయాయని ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇక నియోజకవర్గంలో ఏ పనిచేయాలన్న అధికార పార్టీ నేతలకు కమిషన్లు ఇవ్వాలని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో రేవంత్ ప్రతిపక్షంలో ఉన్న, ఎలాగోలా సొంత డబ్బులైన ఖర్చు పెట్టి పనులు చేసేవారని, ఇప్పుడు ప్రజల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసే పరిస్తితి ఉందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో కొడంగల్‌లో కారు పూర్తిగా రివర్స్ అయ్యే పరిస్తితి వచ్చింది. పైగా ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో పట్నం మళ్ళీ రేవంత్‌పై గెలవడం జరిగే పని కాదని తెలుస్తోంది. ఇక ఎంపీగా ఉన్న రేవంత్...మళ్ళీ కొడంగల్ బరిలో దిగడం ఖాయమే. ఈ సారి మాత్రం కొడంగల్‌లో రేవంత్ విజయాన్ని ఆపడం కష్టమని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: