ఏపీ ఉద్యోగ సంఘాలన్నీ పీఆర్సీ సాధన కోసం కలసి కట్టుగా పోరాటం ప్రారంభించాయి. గతంలో పీఆర్సీ అమలుకోసం ఉద్యమం చేసిన సమయంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. అయితే ఇప్పుడు పీఆర్సీతో నష్టం జరిగింది, హెచ్ఆర్ఏ విషయంలో దారుణం జరిగింది అంటూ ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలన్నీ పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఉద్యోగుల మధ్య విభేదాలంటూ ప్రచారం మొదలవుతోంది.

ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి ఉంది. ట్రెజరీ ఉద్యోగులు పాత బిల్లులు పెట్టగలరా, లేక కొత్త పీఆర్సీ ప్రకారం కొత్త బిల్లులు ప్రాసెస్ చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే వారు ఉద్యమానికే మద్దతిస్తున్నామని, కొత్త బిల్లుల విషయంలో తమపై ఒత్తిడి తేవద్దని చెబుతున్నారు. ఈలోగా సోషల్ మీడియాలో కూడా కొన్ని గ్రూపులు మొదలయ్యాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియా.. ఉద్యోగులవి గొంతెమ్మ కోర్కెలంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఉద్యోగుల్లోనే కొంతమందితో ఈ మేరకు స్టేట్ మెంట్లు ఇప్పిస్తోంది. తాము ప్రభుత్వంతోటే అంటూ ఓ వర్గం ఉద్యోగులు స్టేట్ మెంట్లు ఇచ్చినట్టు ప్రచారం చేస్తోంది. దీంతో సహజంగానే ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర విమర్శలు మొదలు పెట్టారు.

తమలో చీలికలు తేవాలని చూడొద్దని, తమపై లేనిపోని నిందలు వేసి, ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని కోరుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఇప్పటికే తమపై దుష్ప్రచారం మొదలైందని, దీనికి కారణం ఎవరైనా అలాంటి ప్రచారాన్ని ఆపేయాలని వేడుకుంటున్నారు. ప్రజలకు సందేశం పేరుతో ఉద్యోగులు అర్థం చేసుకోండి అంటూ సోషల్ మీడియా గ్రూపుల్లో కొన్ని సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ దశలో ఉద్యోగులని తీవ్రంగా దుర్భాషలాడుతూ ఇవి ఉంటున్నాయి. దీంతో ఉద్యోగులు కలత చెందారు. ప్రజలను రెచ్చగొట్టేలా, తమపై వ్యతిరేకత పెంచాలా ఇలాంటి మెసేజ్ లు పెట్టొద్దని అంటున్నారు. అదే సమయంలో ఉద్యమంలో చీలిక తెచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారనే అనుమానాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: