నందమూరి బాలకృష్ణ... సినీ నటుడే కాదు, రాజకీయవేత్త కూడా.ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత శాసన సభ్యుడాయన.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఆయన రాయలసీమ నేపథ్యంలో తనదైన డిమాండ్ చేశారు. ఇంతకీ ఏమిటది ? జస్ట్ ఓ లుక్ వేయండి.
రాయల సీమ జిల్లాలలో తెలుగుదేశం పార్టీ కేవలం రెండే రెండు స్థానాలను కైవశం చేసుకుంది. ఒకటి కుప్పం కాగా మరోకటి హిందుపురం. కుప్పం నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ  అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తుండగా, హిందూపురం నియోజక వర్గం నుంచి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రి మండలి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది.  దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు కూడా ఇప్పటి వరకూ నోరు మెదప లేదు. కాగా తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ కొత్త జిల్లాల ఏర్పాటు పై తోలిసారిగా స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జిల్లా పుటపర్తి కేంద్రంగా నడుస్తుందని ముసాయిదాలో పేర్కోంది. అయితే నందమూరి బాలకృష్ణ తాను ప్రాతనిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హిందూపురం ఇప్పటికే అభివృద్ధి చెందినదని పేర్కోన్నారు. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని వసతి సౌకర్యాలు హిందూపురంలో ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఏదైయినా అభివృద్ధి చేయాలంటే అందుకు అవసరమైనంత భూమి కూడా హిందూపురంలో ఉందని బాలకృష్ణ ప్రభుత్వానికి తెలియాజేశారు.  జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో ఒక జిల్లాకు  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరు పెట్టిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆయన కుమారుడు బాలకృష్ణ విజ్ఞప్తిని ఆలకిస్తుందా ? వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk