అయితే ఆ రెండు పార్టీల వార్‌లో కాంగ్రెస్ రేసులో వెనుకబడింది...కానీ బీజేపీ కంటే కాంగ్రెస్‌కే బలం ఉంది..ఆ విషయం అందరికీ తెలుసు..కాకపోతే నేతల మధ్య ఉన్న లుకలుకలు వల్ల కాంగ్రెస్ వెనుకబడే పరిస్తితి వచ్చింది. అలా వెనుకబడి ఉన్న కాంగ్రెస్‌ని రేసులో నిలబెట్టడానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు....ఆయన అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు...రేవంత్ ఏమో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంటే..మిగతా కాంగ్రెస్ నేతలు వెనక్కి తీసుకెళ్తున్నారు.
కానీ ఏదొక విధంగా రేవంత్ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకెళుతున్నారు...ఇటీవల ఆయన మరింత దూకుడు పెంచారు..ఓ వైపు టీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తూనే...మరోవైపు బీజేపీని కూడా వదిలిపెట్టకుండా పనిచేస్తున్నారు. ఈ మధ్య సీఎం కేసీఆర్...రాజ్యాంగం మార్చాలంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే..ఇక ఈ అంశం తీవ్ర స్థాయిలో వివాదమైంది...దీనిపై రేవంత్ రెడ్డి పోరాటం చేశారు..కాంగ్రెస్ శ్రేణులని పోరాటంలో దించారు.
తాజాగా ప్రధాని మోదీ ఏపీ విభజనపై మాట్లాడారు....కాంగ్రెస్ దారుణంగా రాష్ట్ర విభజన చేసిందని కామెంట్ చేశారు...అయితే రాష్ట్ర విభజనపై మాట్లాడి...తెలంగాణ ఉద్యమాన్ని మోదీ అవమానించారని టీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఇక మోదీ మాటలపై రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు..అసలు మోదీ మాటల ద్వారా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఇందులో టీఆర్ఎస్ పాత్ర ఏమి లేదని తేలిందని, అలాగే తెలంగాణ కోసం బీజేపీ చేసింది ఏమి లేదని కూడా తెలిసిందని అన్నారు. ఇలా ఓ వైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీలని టార్గెట్‌గా రేవంత్ దూసుకెళుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి