ఉక్రెయిన్ పై రష్యా బలగాలు దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కొందరు సైనికుల్ని వెనక్కి పిలిచామనీ.. చర్చలకు సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పినప్పటికీ అమెరికా పూర్తిగా నమ్మడం లేదు. యుద్ధానికి దిగితే స్వయంగా గాయం చేసుకున్నట్టే అవుతుందని రష్యా అధ్యక్షుడిని బైడెన్ ఘాటుగా హెచ్చరించారు.

అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు చెదిరిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి. రష్యా కూడా తమ యుద్ధ బలగాలను ఉక్రెయిన్ సరిహద్దు నుంచి వెనక్కి రప్పించింది. తాము యుద్ధాని కోరుకోవడం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. కానీ ఉక్రెయిన్ పై దాడి చేసేందుకు అవకాశముందని సంకేతాన్ని ఇచ్చారు. అమెరికా, నాటో కూటమితో చర్చలకు సిద్ధమన్నారు. మాస్కో వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ సోల్జర్ తో చర్చల తర్వాత ఆయన మాట్లాడారు.

ఇక ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్ కు వెళ్లిన దాదాపు 18వేల మంది భారతీయ విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. వీరిలో గుజరాత్ నుంచి 5వేల మంది ఉన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుందన్న వార్తల మధ్య వీరంతా ఆందోళన చెందుతున్నారు. వెంటనే కాలేజీలు ఖాళీ చేయాలని యూనివర్సిటీలు సూచిస్తున్నాయి. అక్కడ విమాన ప్రయాణాలపై నిషేధంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉంది. ఎక్కువగా వైద్యవిద్య కోసం విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్తుంటారు.

ఇక ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో భారతీయులు తక్షణమే స్వదేశం రావాలని సూచించిన కేంద్రం.. ప్రస్తుతం అక్కడి అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండటం సురక్షితం కాదని పేర్కొంది. అయితే ఉక్రెయిన్ లో మెడిసిన్ కోర్సులు చదివేందుకు భారత్ నుంచి వేలమంది విద్యార్థులు వెళుతుంటారు.

అసలు విషయం ఏంటంటే.. సోవియట్ యూనియన్ రద్దుకు ముందు వరకు రష్యాలో ఉక్రెయిన్ భాగంగా ఉండేది. 1991తర్వాత దానికి స్వాతంత్ర్యం లభించింది. ఉక్రెయిన్ తో రష్యా పొడవైన సరిహద్దు కలిగియుండగా ... దాన్ని స్థావరంగా చేసుకొని శత్రుకూటమి తమపై దాడి చేసే ప్రమాదం ఉందని రష్యా భయపడుతోంది. అందుకే ఆ దేశాన్ని మల్లీ హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. కానీ రష్యాకు శత్రువైన అమెరికా ఉక్రెయిన్ కు మద్ధతుగా నిలుస్తోంది. దీంతో యుద్ధ వాతావరణం నెలకొంది.




మరింత సమాచారం తెలుసుకోండి: