ఇక ఫీల్డింగ్ లో టీమిండియాలో అందరికన్నా నెమ్మదిగా కదిలే ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. అయితే అది ఆయన బాడీ లాంగ్వేజ్. అంతమాత్రాన ఆయన క్యాచ్ లు జారవిడిచే రకం అయితే కాదు.చేతికందిన క్యాచ్ ను రోహిత్ శర్మ మిస్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఫీల్డింగ్ లో అంత చురుగ్గా ఉండనప్పటికీ రోహిత్ శర్మ ను స్లిప్ లో ఉంచుతుంటారు. టి20 వన్డే టెస్టులు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ స్లిప్ ఫీల్డింగ్ లో ఉంటాడు రోహిత్ శర్మ .అయితే మైదానంలో మాత్రం వేగంగా కదల్లేడన్న అభిప్రాయం అనేది ఉంది.బంతి కోసం పరుగెత్తడంలో కానీ డైవ్ చేయడంలో కానీ రోహిత్ శర్మ చాలా నెమ్మది.ఇక ఈ విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ రోహిత్ శర్మ లాంటి క్లాస్ బ్యాట్స్ మన్ కు అదేమంత వంక పెట్టదగిన లోపంగా ఎప్పుడూ కూడా అసలు వెలుగులోకి రాలేదు. అయితే బుధవారం నాడు వెస్టిండీస్ తో జరిగిన తొలి టి20లో రోహిత్ శర్మ చురుకైన క్యాచ్ పట్టి అద్భుతం అనిపించాడు.

 బహుశా రోహిత్ శర్మ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్లలో ఇదొకటి.అంతేకాదు.. బ్యాట్స్మెన్ గా కూడా క్రీజులో పరుగులు తీయడానికి పెద్దగా ఇష్టపడని రోహిత్.. ఫీల్డింగ్లోనూ ఎక్కువ ఒత్తిడి తీసుకోవడానికి అసలు ఇష్టపడడు. కానీ తాజాగా వెస్టిండీస్ తో జరిగిన మొదటి టి20 మ్యాచ్లో మాత్రం టీమిండియా కెప్టెన్ ఆహా అనిపించే క్యాచ్తో మెరిశాడు. 34 ఏళ్ల వయసులో తన ఫిట్నెస్పై అభిమానులు ఎలాంటి సందేహాలు పెట్టుకునే అవకాశం లేకుండా చేశాడు.ఇక సూర్యకుమార్ ను కాదని చురుకైన క్యాచ్ ను అందుకుని..కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టి20లో విండీస్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ను హర్షల్ పటేల్ వేశాడు. ఓడియన్ స్మిత్ మిడాఫ్ వైపుగా భారీ షాట్ ఆడాడు. బాల్ ని అందుకునేందుకు లాంగాఫ్ నుంచి సూర్యకుమార్ ఇక దూసుకువస్తున్నాడు. అయితే ఎక్స్ట్రా కవర్ నుంచి రోహిత్ శర్మ వెనుకకు పరిగెత్తుతూ డైవ్ చేసి ఆ సూపర్ క్యాచ్ అందుకున్నాడు.ప్రస్తుతం ఈ క్యాచ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: