రాజ‌కీయాల్లో ఒక్క నేత కార‌ణంగా.. పార్టీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అదేస‌మ‌యంలో ఒకే ఒక్క వ్య‌క్తి కార‌ణంగా.. అదే పార్టీ దెబ్బ‌తినే ప‌రిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు వైసీపీలో ఇదే విష‌యం అంత‌ర్మ‌థ‌నంగా మారిపోయింది. ఒకే ఒక్క నేత చేసిన వ్య‌వ‌హారం.. పార్టీకి త‌ల‌నొప్పిగా మారింద‌ని సీనియ‌ర్ నేత‌లు సైతం చెబుతున్నారు. దీంతో ఇప్పుడు నేత‌ల‌కు విలువ లేకుండా పోయింద‌ని.. వారిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కీల‌క‌మైన‌.. విశాఖ‌ప‌ట్నంలో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా.. అన్నీ వైసీపీ ద‌క్కించుకుంది.

ఈ న‌గ‌రాన్ని.. రాజ‌ధాని ప్రాంతంగా ప్ర‌క‌టించేందుకు వైసీపీ అధినేత దూకుడుగా ఉన్నారు. సీఎం జ‌గ‌న్ కాన్సంట్రేష‌న్ అంతా కూడా విశాఖ‌పైనే ఉంది. అయితే.. ఇక్క‌డ ప్ర‌జా ప్ర‌తినిధుల విష‌యంలో ఆయ‌న‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఇటీవ‌ల విశాఖ రాజ‌ధానిపై ఇక్క‌డి ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు.. ఈ క్ర‌మంలో త‌మ‌కు ప్ర‌జాప్ర‌తినిధులు అందుబాటులో లేరని ప్ర‌జ‌లు చెబుతున్నారు. విశాఖ ఎంపీ, అర‌కు ఎంపీ స‌హా .. ఎమ్మెల్యేలు ఎవ‌రూ ఈ మూడేళ్ల‌లో ప్ర‌జ‌ల్లో తిరిగింది లేదు. ప్ర‌జ‌ల  మ‌ధ్య ఉన్న‌ది కూడా లేదు. ఎందుకంటే... ఇక్క‌డ అన్నీ కూడా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి నేతృత్వంలోనే సాగాయి.

అయితే.. ఇప్పుడు ఆయ‌న ప్ర‌భావం ఇక్క‌డ త‌గ్గిపోయింది. కార‌ణాలు ఏవైనా కూడా ఇప్పుడు సాయిరెడ్డి ఇక్క‌డ క‌నిపించ‌డం లేదు. దీంతో ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌మ‌ధ్య‌కు రావాల్సిన అనివార్య ప‌రిస్థితి ఏర్ప డింది. అయితే.. అనేక స‌మ‌స్య‌ల‌పై.. సాయిరెడ్డి ఏం చెప్పారో.. ఇప్పుడు తాము ఏం చెప్పాలో.. తెలియ‌క‌.. ప్ర‌జాప్ర‌తినిధులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌నే ఆవేద‌న ఒక‌వైపు.. సాయి రెడ్డి అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపిస్తామ‌ని.. ఇచ్చిన హామీ మ‌రోవైపు వీరిని కుంగ‌దీస్తున్నా యి.

ఈ నేప‌థ్యంలో విశాఖ‌లో ఎంతో మంది ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పోతున్నార‌నే వేద‌న క‌నిపిస్తోంది. దీనిపై ఇప్ప‌టికే..ప‌లువురు నాయ‌కులు  పార్టీలో కీల‌క నేత‌ల‌కు త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నార‌ని.. అయినా.. ప‌రిస్థితిలో మాత్రం మార్పు రావ‌డం లేద‌ని అంటున్నారు. రేపు సాయిరెడ్డి మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని. కానీ.. తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. వాపోతున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: