ఎల్లోమీడియా కాచుకుని కూర్చునుంది. ఎందుకంటే మంత్రివర్గ ప్రక్షాళన లేదా పునర్వ్యవస్ధీకరణ ఎప్పుడుంటుందా అని. నిజానికి ఎల్లోమీడియాకు మంత్రివర్గంలో ఉండే వాళ్ళపైన పెద్దగా ఆసక్తి ఏమీలేదు. మరెందుకు రెడీగా కాచుక్కూర్చునుందంటే బండలేయటానికి. మంత్రివర్గంలో చోటు కోల్పోయిన వారికి ఎంతైనా బాధుండటం సహజం. మంత్రులుగా తమ పనితీరు ఎలాగుంది ? తాము నిర్వహించిన శాఖలకు ఎంతవరకు న్యాయం చేశామని స్వీయ విశ్లేషణలు చేసుకునే మంత్రులెంతమందుంటారు ?





బాధ్యతలని, న్యాయం చేయాలని అనుకునే వాళ్ళకన్నా హోదాను అనుభవిస్తు, ప్రోటోకాల్ ను ఎంజాయ్ చేసేవాళ్ళు, సొంతపనులు చక్కపెట్టుకునే వాళ్ళే ఎక్కువమందుంటారు. మంత్రులుగా ఉన్నపుడు తమ వల్ల ప్రభుత్వానికి, పార్టీకి మంచి జరగాలని కోరుకునే వారికన్నా పదిమందిలో తమ దర్పం చూపించేవాళ్ళు తమ వర్గానికి అవసరమైన పనులు చేసుకునే వాళ్ళే ఎక్కువ. మరలాంటి వాళ్ళకి తాము  మాజీలమైపోతున్నామంటే ఎంత బాధగా ఉంటుంది ?





సరిగ్గా అలాంటి వాళ్ళే ఎల్లోమీడియాకు అవసరం. మాజీలపై సానుభూతి చూపిస్తున్నట్లు నటిస్తు, వాళ్ళని జగన్మోహన్ రెడ్డిపై రెచ్చగొడుతు, ప్రభుత్వంపైపో లేకపోతే పార్టీ లేదా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేట్లుగా రెచ్చగొట్టడమే పనిగా కూర్చున్నది. ఒకపుడు చంద్రబాబునాయుడు హయాంలో మంత్రివర్గంలో మార్పులు జరిగినపుడు పార్టీలో పెద్ద సంచలనమే అయ్యింది. బోండా ఉమ, బుచ్చయ్యచౌదరి, కాగిత వెంకటరావు, పీతల సుజాత లాంటి వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.





అప్పట్లో చంద్రబాబుకు ఇబ్బంది లేకుండా వాళ్ళని బుజ్జగించటంలో భాగంగా అప్పటి వేడిని వీలైనంతలో ఇదే ఎల్లోమీడియా డౌన్ ప్లే చేసింది. అలాంటి పరిస్ధితి ఇపుడు వస్తే అదే వేడిని వీలైనంతగా ఓవర్ ప్లే చేయటానికి ఎల్లోమీడియా కాచుకుని కూర్చున్నది వాస్తవం. మాజీలను సామాజికవర్గాల వారీగా రెచ్చగొట్టడమే పనిగా కథనాలు, వార్తలు వండివార్చటం ఖాయం. ఆ విషయమే చూచాయగా ఎల్లోమీడియా వార్తలు, కథనాల్లో కనబడుతోంది. మంత్రులు మాజీలు అవ్వటమే ఆలస్యం ఎల్లోమీడియాలో ఎంత రచ్చ జరుగుతుందో చూడాల్సిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: