నీటిని ఇలానే వృదా చేస్తూ పోతే 2050 నాటికి ప్రపంచంలో జనాలకు కావలసినంత తాగు నీరు దొరకదని, ప్రజలు స్నానాలు చేయడం మానేసి శరీరానికి రసాయన లేపనాలు పూసుకుని సరిపెట్టుకుంటారు అని, తలస్నానానికి నీరు దొరక్క గుండ్లు చేయించుకోవాల్సి వస్తుందని, సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం కాస్త నీటి వనరుల చుట్టూ కాపలా ఉంటుందని’ అని ఒకానొక సందర్భంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. ఇపుడు పరిస్థితులను నిశితంగా గమనిస్తే ఆయన చెప్పింది నిజంగా జరుగుతుందేమో అనిపిస్తోంది, అయిన 2050 ఎంతో దూరం లేదు. ఇప్పుడే దాదాపుగా 220 కోట్ల మందికి పైగా ప్రజలకు సురక్షితమైన నీరు అందటం లేదు.
ఇప్పటికైనా సరైన జాగ్రత్తలు తీసుకుని సంరక్షించుకోకపోతే విపత్తు తప్పదు. ముందుగా చెట్లను పెంచడంలో మీ వంతు పాత్రను పోషించింది. ఎక్కువగా చెట్లను పెంచండి. నీటిని వాడిన వెంటనే కొళాయిలను కట్టేయండి. టాయిలెట్లు పగిలి పోతే నిర్లక్ష్యంగా వదిలేయకుండా రిపేర్ చేయించి, నీరు లీక్ అవకుండా చూసుకోవాలి. నిత్య అవసరాలకు నీటిని వాడే సమయంలో అవసరానికి మించి నీటిని వాడి వృదా చేయకండి. అయితే మనము వృధా చేయకుండా నీటి వనరులను పెంచుకునే పద్దతులను పాటించాలి. ఇంటికి ఒక చెట్టును నాటితే, ఊరంతా చెట్లు మయం అయ్యి వరుసలు కురవడానికి ఆధారం అవుతుంది. తద్వారా భూమిలో జలాలు పెరుగుతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి