తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి మరియు గవర్నర్ కు మధ్యన పొరపొచ్చాలు ఇంతకీ పోవడం లేదు. చిన్న చిన్న మనప్సర్ధలు పెరుగుతూ పోతున్నాయి. అయితే ప్రజల కోసం పనికి చేసే ఇద్దరు ప్రజాప్రతినిధులకు ఎందుకు ఈ సమస్యలు అన్నది సామాన్యులకు తెలియని విషయం. అయితే వీరి మధ్య ఏ విధమైన సమస్యలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళిసై ని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించింది. ఆ తర్వాత గవర్నర్ తమిళిసై ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం అసలు సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి ప్రజా దర్భారు అన్న కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకున్నారు.

అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలా చర్చ జరిగింది. అయితే గవర్నర్ ఇలాంటి విషయాలపై దృష్టి సారించడం పైన తెరాస ప్రభుత్వం అసంతృప్తి చెందింది. ఇంకా కరోనా సమయంలోనూ ప్రభుత్వంతో సంబంధం లేకుండా వైద్యాధికారులతో రివ్యూ మీటింగ్ లు మిగిలిన తదితర విషయాలలో గవర్నర్ వ్యవహారించిన తీరు కూడా ఈ దూరాన్ని పెచింది అని చెప్పాలి. ఇక గవర్నర్ కోటా లో కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్సీ చేయాలని పంపిన ఫైల్ ను కూడా పెండింగ్ లో పెట్టడం పెద్ద రభస అయింది. అంతే కాకుండా సమ్మక్క జాతరలో గవర్నర్ కు సరైన గౌరవం దక్కలేదని తమిళిసై ఫీల్ అయ్యారు.

ఇలా గవర్నర్ తనకు సరైన గౌరవం దక్కడం లేదని వాపోయారు. ఇక ప్రభుత్వం కూడా మమల్ని సంప్రదించకుండా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని పెదవి విరుస్తున్నారు.  ఇలా పలు విషయాలలో ప్రభుత్వానికి మరియు గవర్నర్ కు మధ్యన గ్యాప్ బాగా పెరిగిపోయింది. అయితే తాజాగా గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మరి ఈ విషయాలు అన్నింటినీ తమిళిసై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తుందా? చేసినా తెలంగాణ ప్రభుత్వంపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: