ఈ అధికారులు చెబుతున్న ప్రకారం రాబోయే రెండు రోజులు విఫరీతమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తాయని తెలుస్తోంది. మాములుగా ఎండలను తట్టుకోవడమే కష్టం.. ఇక దానికి తోడు వెచ్చని వడగాలులు తోడైతే ఇక నరకమే అని చెప్పాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ వడగాలులు వీస్తాయట. మరి ఆ ప్రాంతాలు ఏమిటో తెలుసుకుందామా?
నిన్న కడప లోని కొన్ని మండలాలలో వడగాల్పులు వీచిన విషయం తెలిసిందే. అయితే రాబోయే మరో 24 గంటలలో తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని మండలాల్లో వేడి గాలులు వీస్తాయని తెలుస్తోంది. ఈ జిల్లాతో పాటుగా విజయనగరం మరియు విశాఖపట్నం లోని కొన్ని చోట్ల వడగాలులు వీస్తాయట. మరి సదరు జిల్లాలకు చెందిన ప్రజలు అలెర్ట్ గా ఉండాలని ఏపీ ప్రభుత్వ విపత్తు నిర్వహణ అధికారులు సూచిస్తున్నారు. మీకు ఏమైనా పనులు ఉంటే ఉదయం 11 గంటల లోపు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోండి లేదా సాయంత్రం 5 గంటలకు పైన వెళ్ళండి. అంతే కానీ ఈ లోపు బయటకు వస్తే ఎండల తాకిడికి అనారోగ్య పాలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి