ప్రేమ ఎంతో మధురమైనది.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమకు ప్రత్యేక స్థానం ఉంటుంది. రెండు మనసుల మధ్య ఎప్పుడు ఏ క్షణంలో ప్రేమ పడుతుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. ఒక్కసారి ప్రేమ పుట్టిన తర్వాత ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక తాము ప్రేమించిన వారికి తమ మనసులో దాగి ఉన్న ప్రేమను చెబితే గుండె భారం తగ్గుతుంది అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే  కొంతమంది సాదాసీదాగా ప్రపోజ్ చేస్తే మరి కొంతమంది సినిమాలు కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ప్రపోజ్ చేసి ప్రియురాలికి సర్ప్రైజ్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు.


 కాగా ఇటీవలి కాలంలో అయితే ప్రతీ విషయంలో వినూత్నంగా ఆలోచిస్తున్న జనాలు ప్రతి విషయంలో కూడా కొత్తగా  ట్రై చేస్తున్నారు  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాస్త వెరైటీగా ప్రపోజల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. సాధారణంగా లవ్ ప్రపోజ్ అనగానే అందరూ చేతిలో ఒక రెడ్ రోస్ పట్టుకొని ఇక ప్రియురాలి దగ్గరికి వెళ్లి ఆ రోస్ ప్రియురాలికి ఇచ్చి ప్రేమను వ్యక్తపరచడం లాంటిదే ఎక్కువగా ఊహించుకుంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం వెరైటీ ప్రపోజల్ చేశాడు అని చెప్పాలి.


 ఇక ఈ వెరైటీ ప్రపోజల్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది సౌరబ్  అనే యువకుడు ఉత్కర్ష ను కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఒకే కాలేజీ లో ఇద్దరు చదువుతూ ఉంటారు. కానీ పరిచయం మాత్రం లేదు. అతనికి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. దీంతో ఎలాగైనా ప్రేమను ప్రియురాలికి తెలియజేయాలి అనుకున్నాడు. కాస్త కొత్తగా.. మ్యారీ మీ ఉత్కర్ష అని ఒక భారీ కటౌట్ ఏర్పాటు చేశాడు.  ఇక ఆ భారీ హోర్డింగ్ ముందే ఆమెకు ప్రపోజ్ చేయగా ఫిదా అయిన యువతి అతని ప్రేమను అంగీకరించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: