ఆ టైం ఈ టైం అని లేకుండా ఎపుడు హాట్ టాపిక్ గా ఉండే రంగం రాజకీయ రంగం. ప్రతి ఒక్కరికీ సంబందించిన అంశం మన జీవితాలకు కనెక్ట్ అయ్యే అంశం కావడంతో అందరూ ఆసక్తిగా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటారు కూడా. కాగా అన్ని రాష్ట్రాల్లో ను ఎపుడు ఏవో కొన్ని హాట్ టాపిక్స్ ఉండనే ఉంటాయి. ఏపి లో మాత్రం గత కొద్దీ రోజులుగా ఏకధాటిగా వినిపిస్తున్న న్యూస్ ఎన్నికలు. అయితే ఎలక్షన్స్ కి ఇంకా చాలా టైం ఉంది, చేయాల్సింది చాలానే ఉంది, అయిన మన నేతలు మాత్రం రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుండే కసరత్తులు మొదలెట్టేసారు. అధికార పార్టీ నుండి ప్రత్యర్ధి పార్టీల వరకు అంత కూడా ప్రస్తుతం ఎన్నికలనే టార్గెట్ గా పెట్టుకుని వ్యూహాలు రచిస్తూ పావులు కదుపుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

రానున్న ఎన్నికల్లో అధికార పీఠం కోసం ఈసారి పోటీ మామూలుగా లేదు. ముఖ్యంగా ఈ రేసులో జనేసేన పార్టీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే దీని వెనుక పలు కారణాలు ఉన్నాయి. ప్రస్తుత అధికార పార్టీ గత ఎన్నికల్లో ఏ స్థాయిలో మెజారిటీ అందుకుని అధికారంలోకి వచ్చింది అన్నది అందరికీ తెలిసిందే. ఇపుడు కొన్ని విమర్శలు, అసంతృప్తి వంటివి ఎదుర్కుంటున్న ఈ పార్టీ కంటే బెస్ట్ మరో పార్టీ ఏది అన్నట్లుగా ఎక్కువ మంది ప్రజల   అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలు తమ జోరు పెంచేందుకు జోరుగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా  స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ అయిన టిడిపి పూర్వ వైభవాన్ని పొందేందుకు ఈ సారి అధికారం లోకి వచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఇందుకు జనసేన పార్టీ మద్దతు పొందటం అవసరం అని ఫీల్ అవుతూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మరో వైపు ఎప్పటి నుండో పాతుకుపోయిన బిజెపి. అయితే ఏపిలో బిజెపికి పెద్ద స్కోప్ లేదు, కానీ జనసేన పొత్తుతో ఇపుడు ప్రజలను తనవైపుకు తిప్పుకోవాలనే ఆలోచన బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అది ఎంత వరకు కరెక్ట్ అలాగే ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అన్నది చూడాలి.  ఇక ఇదే సమయంలో జనసేన హైలెట్ అవుతోంది, తన పట్టు పెంచుకుని పాగా వేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. తనకి అందుతున్న ప్రాముఖ్యత ను చూసి ఇదే సమయం లో ప్రజల మద్దతు కూడా అధికంగా అందుకునేలా కార్యక్రమాలు చేస్తూ ఏపి లో నెక్స్ట్ రూలింగ్ పార్టీ మాదే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇలా అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వార్తల్లో హైలెట్ గా నిలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: