కరోనా వైరస్ ఏమని వచ్చిందో గానీ ఇపుడు ప్రభావం తగ్గినప్పటికీ ఎదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. రెండేళ్ల పాటు ప్రపంచాన్నే కట్టిపడేసిన ఈ మహమ్మారి ఈ మద్యే కాస్త శాంతించడం తో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇపుడు కరోనా ప్రభావం పెద్దగా లేదు కానీ... వ్యాప్తి మాత్రం విస్తృతంగా ఉంది. అయితే ఇపుడు కరోనా కి సంబంధించి మరొక వార్త కలకలం రేపుతోంది. చిన్నారుల్లో కరోనా కు సంబందించి ఒక అధ్యయనం చేయగా తాజాగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. చిన్నారుల్లో దీర్ఘకాలిక కోవిడ్‌ లక్షణాలు కనీసం రెండు నెలల పాటు కనిపించే అవకాశముందని తాజా అధ్యయనం ప్రకారం నిపుణులు చెబుతున్నారు.

చిన్నారుల్లో ఒకసారి కరోనా వైరస్ వచ్చి తగ్గాక  అలసట, దద్దుర్లు, కడుపు నొప్పి వంటి సమస్యలు మాత్రం దీర్ఘ కాలం కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.  డెన్మార్క్‌లో 2020 జనవరి నుంచి 2021 జులై మధ్య కరోనా మహమ్మారి బారిన పడిన 11 వేల మంది పిల్లల ఆరోగ్య పరిస్థితి ని అలాగే వారితో కోవిడ్ సోకని 30 వేలమంది పిల్లలతో పోలుస్తూ అధ్యయనం జరుపగా..ఈ విషయాలు వెల్లడయ్యాయి అని అంటున్నారు అధ్యయనం చేసిన కోపెన్‌హాగెన్‌ విశ్వవిద్యాలయం ఆసుపత్రి పరిశోధకులు.

ఆ పిల్లలందరూ కూడా 14 ఏళ్ల వయసు లోపు వారే. ఈ అధ్యయనం నివేదికను బట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే..!! కరోనా వచ్చి తగ్గిన పిల్లలు సుమారు రెండు నెలలు పాటు ఏదో ఒక కరోనా లక్షణం తో తరచూ బాధపడుతున్నారు అని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. మరి ఇది పిల్లలకు ప్రమాదమా కాదా అన్న విషయం ముందు ముందు తెలిసే అవకాశం ఉంది. అయితే ఇలా పిల్లలలో వచ్చిన కొత్త మార్పుల కారణంగా తల్లితండ్రులు కంగారు పడుతున్నారు. కాగా గత కొద్ది రోజుల నుండి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మెల్ల మెల్లగా పెరుగుతున్న సంగతి తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: