సాధారణంగా గ్రామాభివృద్ధి కోసం గ్రామ ప్రజలు అందరూ కలిసి స్థానిక ఎన్నికల్లో నమ్మకం ఉన్న వారిని సర్పంచిగా ఎన్నుకుంటు ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక ఇలా సర్పంచిగా ఎన్నుకున్న వారు సచివాలయంపై పూర్తి బాధ్యతలు కలిగి ఉంటారు. ఇక గ్రామ అభివృద్ధికి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఓ మహిళకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఆమె స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ గా విజయం సాధించింది. కానీ అయినప్పటికీ ఆమెకు సచివాలయం లోకి ప్రవేశం లేకపోవడంతో ఆమె ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మునిగిపోయింది.


 ఈ ఘటన కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుమ్మగట్ట గ్రామ పంచాయతీలో వెలుగులోకి వచ్చింది అనేది తెలుస్తుంది. సర్పంచ్ గెలిచినవారు  సచివాలయం పై పూర్తి అధికారాలను కలిగి ఉంటారు. అంతేకాదు  గ్రామాభివృద్ధికి  సంబంధించిన  వివరాలన్నీ ఆయన తెలుసుకునేందుకు అధికారం ఉంటుంది.  కానీ ఇక్కడ ఒక మహిళా సర్పంచ్ విజయలక్ష్మిని  మాత్రం సిబ్బంది అధికారులు చిన్నచూపు చూశారు. దీంతో ఇది భరించలేకపోయిన సదరు మహిళా సర్పంచ్ సచివాలయం ముందు నిరసన వ్యక్తం చేసింది.



 ఇటీవలే శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా గ్రామ సచివాలయం ఆరుబయటే కుర్చీ వేసుకుని కూర్చున్నా సదరు మహిళా సర్పంచ్ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం. సర్పంచ్ గా ఎన్నికైనప్పటికీ నేటి వరకు సచివాలయంలో కూర్చొనివ్వలేదని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా  సంక్షేమ పథకాలు ఇతర సేవల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించినా అధికారులు సంబంధిత సమాచారాన్ని తనకు చెప్పడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక తనపై మండల అధికారులు సైతం ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది . ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతాను అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: