పండగ వస్తుంది అంటే ఏదొక ఆఫర్ ను ప్రకటిస్తారు అది కేవలం ప్రయివేట్ సంస్థలకు మాత్రమే.. ఇప్పటికే పలు సంస్థలు కూడా ఆఫర్లను  అది ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు కూడా అందిస్తున్నాయి. తాజాగా రేషన్ కార్డు దారుల కు ప్రభుత్వం దీపావళి బోనస్ ను ప్రకటించారు.. దీపావళి పండుగ ప్రారంభాని కి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ పవిత్ర పండుగ సందర్భంగా కుటుంబ పెద్దలు, బంధువులు కానుకలు అందజేస్తారు.. మరికొద్ది రోజుల్లో కంపెనీలు కూడా తమ ఉద్యోగుల కు పండుగ బోనస్‌లు, బహుమతులు ఇవ్వడం ప్రారంభించనున్నాయి.


వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పౌరులకు బహుమతు లు కూడా ప్రకటిస్తాయి. ఈ నేపథ్యం లో ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తన పౌరుల కోసం కీలక ప్రకటన చేసింది. అంతేకాదు, మీరు కూడా మహారాష్ట్ర లో నివసిస్తున్నారా... అయితే, రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే ఈ శుభవార్త మీ కోసమే. మహారాష్ట్ర మంత్రివర్గం ప్రకటించింది. రాష్ట్రం లోని రేషన్ కార్డు దారులకు వచ్చే దీపావళి పండుగ రోజున కేవలం రూ.100కే కిరాణా సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


రాష్ట్ర ప్రజలకు ఈ ప్యాకెట్ కేవలం రూ.100కే లభిస్తుంది. ఈ ప్యాకెట్‌ లో 1 కిలో సెమ్యా, వేరు శనగలు, వంటనూనె, పసుపు తదితరాలు ఉంటాయి. ఆహార పౌర సరఫరాల శాఖ వినియోగ దారుల రక్షణ శాఖ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.. ఈ నేపథ్యం లో కేబినెట్ ప్రకటనలో రాష్ట్రం లో 1.70 కోట్ల కుటుంబాలు అంటే ఏడు కోట్ల మంది కి రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వ రేషన్ షాపుల నుంచి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసేందుకు అర్హులు..ఈ ఆఫర్ మన రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండు అనుకోవడం అందరి వంతు అయ్యింది..


మరింత సమాచారం తెలుసుకోండి: