ముందేమో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం తర్వాత తీరిగ్గా ఆ నిర్ణయాలను మార్చుకోవటం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటైపోయింది. పార్టీలో ప్రాంతీయ సమన్వయకర్తలుగా పనిచేస్తున్న నలుగురు సీనియర్ నేతలను మార్చేశారు. అలాగే మరికొందరికి ఆ పదవులను కట్టబెట్టారు. ఇందులో ఒకటికి మించి పదవులున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. దాంతో ఏ పదవికీ సరైన న్యాయంచేయలేక అందరు చతికిలపడుతున్నారు.

విషయం ఏమిటంటే ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్న  సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, మాజీమంత్రులు కొడాలి నాని, అనీల్ కుమార్ యాదవ్ లను ఒక్కసారిగా పీకేశారు. నిజానికి ఎంఎల్ఏ పదవే చాలా కీకలమైనది. ప్రజలందరితో బాగా యాక్సెస్ ఉండే ఎంఎల్ఏలకు నిజానికి 24 గంటలు సరిపోదు. అలాంటిది వారిలో కొందరికి మంత్రిపదవులిచ్చారు. మంత్రిపదవి ఒక హోదా కాబట్టి అందరు హ్యాపీగానే ఫీలవుతారు. ఎప్పుడైతే మంత్రవుతారో  నియోజకవర్గంలో జనాలతో సంబంధాలు తగ్గిపోతాయి.

దాంతో ఊరుకోకుండా ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమించారు. ఒకవైపు నియోజకవర్గంలో చూసుకోవాలి, మరోవైపు మంత్రి బాధ్యతలు ఇది సరిపోదన్నట్లుగా ప్రాంతీయ సమన్వయకర్త బరువు. ఒకమనిషిపై ఇన్ని బాధ్యతలు మోపటం జగన్ అనాలోచిత నిర్ణయమనే చెప్పాలి. ప్రాంతీయ సమన్వయకర్తలుగా సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలంటే ఎంఎల్ఏలకు మంత్రిపదవులు ఇవ్వకూడదు. అలాగే ఎంఎల్ఏలుగా ఉన్నవారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించకూడదు. ప్రాంతీయ సమన్వయకర్తలుగా, జిల్లాల అధ్యక్షులుగా ఎంపీలు, ఎంఎల్సీలు లేకపోతే సీనియర్ నేతల్లో ఎవరినైనా నియమించవచ్చు. జిల్లాల అధ్యక్షులుగా ఎనిమిదిమందిని మార్చేశారు.

మోయలేని బాధ్యతలను మోపి తప్పుచేశారంటే ఇపుడు కూడా మళ్ళీ అదే తప్పుచేశారు. పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు. ఎంఎల్ఏగా ఉన్న చెవిరెడ్డినే తుడా ఛైర్మన్ గా నియమించారు. తుడా ఛైర్మన్ హోదాలో టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఇవి సరిపోవన్నట్లు అనుబంధ విభాగాల సమన్వయ కర్తగా కొత్త బాధ్యత. ఎంఎల్ఏగా ఉన్న వ్యక్తినే తుడా ఛైర్మన్ గా నియమించేబదులు ఇంకో నేతను నియమిస్తే సంతోషిస్తాడు. అలాగే అనుబంధ విభాగాల సమన్వయకర్తగా మరో సీనియర్ ను నియమిస్తే సదరు నేత హ్యాపీగా ఫీలవుతారు. జగన్ వ్యవహారం అతివృష్టి లేకపోతే అనావృష్టి లాగుంటుంది. కాబట్టి నేతల ఫెయిల్యూర్లకు జగనే కారణమని చెప్పకతప్పదు.మరింత సమాచారం తెలుసుకోండి: