తాను ప్రదర్శించిన ఫోన్లతో  కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అడ్డంగా దొరికినట్లేనా ? మంగళవారం ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో కవిత విచారణకు హాజరయ్యారు. అంతకుముందు కేసీయార్ నివాసంలో నుండి బయటకు వచ్చినపుడు కారులోకి ఎక్కిన కవిత రెండుచేతుల్లో రెండు కవర్లను ప్రదర్శించారు. అందులో మొబైల్ ఫోన్లున్నాయి. అవేమిటంటే తాను వాడిన మొబైల్ ఫోన్లు ధ్వంసంచేయలేదని చెప్పటమే కవిత ఉద్దేశ్యం. కోర్టుకు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్టులో లిక్కర్ స్కామ్ లోని 36 మంది 170 ఫోన్లను వాడారని, వాటన్నింటినీ ద్వంసం చేసినట్లు ఈడీ చెప్పింది.





సో ఈడీ చెప్పినట్లుగా తాను మొబైళ్ళను ధ్వంసంచేయలేదని, తన విషయంలో ఈడీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని కవిత ఎదురుదాడికి దిగారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. అవేమిటంటే మొదటిదేమో ఒక ఇంటర్వ్యూలో తనపేరుతో ఒక్క మొబైల్ ఫోన్ కూడా లేదన్నారు. తాను రెండు ఫోన్లు మాత్రమే వాడుతున్నట్లు చెప్పారు. ప్రజాజీవితంలో ఉన్నపుడు తానసలు ఫోన్లే వాడనని కూడా అన్నారు.





ఇక్కడ అనుమానం ఏమిటంటే తనపేరుతో అసలు ఒక్క మొబైల్ ఫోన్ కూడా లేదని చెప్పిన కవిత, తాను రెండుఫోన్లను మాత్రమే వాడుతున్నట్లు చెప్పిన కవిత ఈరోజు తొమ్మిది ఫోన్లను ఎలా చూపించారు ? కవిత వాడుతున్న రెండు ఫోన్లు ఎవరిపేరుతో ఉన్నాయి ? మంగళవారం చూపించిన తొమ్మిది ఫోన్లు ఎవరివి ? తాను రెండుఫోన్లు మాత్రమే వాడుతున్నట్లు చెప్పిన కవిత మరీరోజు అదనంగా ఏడు ఫోన్లు ఎలా చూపించారు ?





రెండో అంశం ఏమిటంటే కవిత వాడినట్లుగా ఈడీ చెబుతున్న ఫోన్ల ఐఎంఈఐకి కవిత ఇచ్చిన ఫోన్ల ఐఎంఈఐ మ్యాచ్ కాలేదని ప్రచారం మొదలైంది. మరి కవిత వాడినట్లుగా ఈడీ ఆరోపిస్తున్న ఫోన్లు అసలున్నాయా ? ఉంటే ఎక్కడున్నాయి ? లేకపోతే ఉన్నట్లు ఈడీ ఎలా చెబుతోంది ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: