కమలంపార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తయితే పెట్టుకున్నారు కానీ కలిసి పనిచేసింది పెద్దగా లేదు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో కానీ తర్వాత జరిగిన ఒక పార్లమెంటు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉఫఎన్నికల్లో బీజేపీ పోటీచేసి ఓడిపోయింది. అప్పుడు కూడా జనసేన నుండి బీజేపీ ఆశించిన మద్దతు దొరకలేదు. ఇటీవలే జరిగిన పట్టభద్రుల ఎంఎల్సీ కోటా ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్ధులకు జనసేన మద్దతివ్వలేదు.





ఉత్తరాంధ్ర స్ధానంకు జరిగిన ఎన్నికలో వైసీపీకి ఓటేయద్దని పిలుపిచ్చిన పవన్ కల్యాణ్ బీజేపీకి ఓటేయమని మాత్రం అడగలేదు. ఇదే విషయమై బీజేపీలో పెద్ద చర్చే జరిగింది. దాని పర్యవసానమే ఓడిపోయిన అభ్యర్ధి మాధవ్ మీడియాతో బహిరంగ ఆరోపణలు. ఎంఎల్సీ ఎన్నికల్లో తమకు పవన్ సహకరించలేదని స్పష్టంగా చెప్పారు. అసలు తమరెండు పార్టీలు పొత్తులో ఉన్నాయా లేదా అన్నదే అనుమానంగా ఉందన్నారు.





ఈ వ్యాఖ్యలతోనే పవన్ అంటే కమలనాదుల్లో ఎంతటి మంటుందో అర్ధమైపోతోంది. పవన్ మీద బీజేపీ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తికి మాధవ్ ప్రకటనే తాజా ఉదాహరణ. బీజేపీతో ఉంటూనే టీడీపీతో పొత్తుకు పవన్ రెడీ అయిపోయారు. ఈ విషయాన్ని దాచుకోకుండా పవన్ బహిరంగంగానే ప్రకటించారు. అయినా పవన్ను బీజేపీ నేతలు ఒక్కమాట కూడా అనలేదు. అలాంటిది ఎంఎల్సీ ఎన్నికల ఫలితం వచ్చిన వెంటనే పవన్ తమకు సహకరించటంలేదని మాధవ్ అన్నారంటే అర్ధమేంటి ?  పైగా ఎంఎల్సీ ఎన్నికల్లో తమకు సహకరించమని అడిగినా పవన్ పట్టించుకోలేదని నిష్టూరంగా చెప్పారు.





పార్టీ చీఫ్ సోమువీర్రాజుకు మాధవ్ బాగా సన్నిహితుడన్న విషయం తెలిసిందే. అంటే ఇపుడు మాధవ్ వ్యాఖ్యలు వీర్రాజుకు తెలీకుండా చేసే అవకాశంలేదు. నిజానికి చాలామంది బీజేపీ నేతలకు పవన్ అంటే మంటగా ఉంది. తమతో పొత్తులో ఉంటూనే టీడీపీతో పొత్తుగురించి మాట్లాడటాన్ని సహించలేకపోతున్నారు. అయితే ఏమీ చేయలేక మౌనంగా ఉంటున్నారు. అలాంటి ఇపుడు ఎంఎల్సీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవటంతో ఆ కోపాన్ని పవన్ పైన బహిరంగంగా ప్రకటిస్తున్నారు. తొందరలోనే మాధవ్ లాగే మరికొంతమంది నేతలు పవన్ పై ధ్వజమెత్తే అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: