తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విశ్లేషణ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.బుధవారం నాడు ఉత్తర - దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య ప్రదేశ్ నుంచి విదర్భ ఇంకా ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక దాకా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో నేటి నుంచి భారీ గాలులు కూడా వీయనున్నాయి. కాబట్టి ఎలాంటి పంట నష్టం కలగకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఇంకా అలాగే రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడంతో పాటు.. అలాగే ఎల్లుండి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


రాబోయే 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలలో మధ్యహ్నం గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.హైదరాబాద్ నగర పరిసర జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఉరుములు అలాగే మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.అలాగే గురవారం కూడా ఉరుములు ఇంకా మెరుపులుతో కూడిన వర్షం కురుస్తుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా హైదరాబాద్ పరిసర ప్రజలు తప్పకుండా అప్రమత్తంగా ఉండలని అసలు ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకపోవడం చాలా మంచిదని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: