కానీ ఇప్పుడు ఉక్రెయిన్ నుండి వచ్చే వాణిజ్య నౌకలను కూడా నల్ల సముద్రంలోకి అనుమతించడం లేదు రష్యా. అసలు ఇక్కడి నుండి ఎగుమతి అయ్యే గోధుమలే ఆఫ్రికా దేశాల వాళ్ళకి తక్కువ ధరకు వచ్చే ఆహార పదార్థాలు. యూరప్ దేశాలు కూడా ఈ గోధుమలను తీసుకుంటూ ఉంటాయి. అయితే ఆ తర్వాత ఈ గోధుమలను సగం ఆఫ్రికా దేశాలు తీసుకుంటే మిగిలిన సగం నాటో దేశాలు తీసుకుంటున్నాయని తెలుస్తుంది.
అయితే ఇలా గోధుమలు తీసుకున్న నాటో దేశాలు అవే వాణిజ్య నౌకల ద్వారా ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేసేవి. దాని వల్ల రష్యాకు అలాగే ఆఫ్రికా దేశాలకు సమస్యలు వచ్చాయని తెలుస్తుంది. అసలు యుద్ధ నౌకలను అనుమతి ఇవ్వని రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ యూరప్ దేశాలతో కలిసి ఆడుతున్న నాటకాన్ని గ్రహించింది. దాంతో ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అయ్యే గోధుమల రవాణా ఆగిపోయింది.
తన మాటను కాదని వాణిజ్య నౌకలను నడిపితే మిస్సైల్స్ తో దాడి చేస్తామని చెప్పాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. దాంతో ఆఫ్రికా దేశంలో ధరలు పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు ఆకలితో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే మరో పక్కన రష్యా కూడా ఆఫ్రికా దేశాలతో స్నేహం చేస్తుందని తెలుస్తుంది. అయితే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ 6ఆఫ్రికా దేశాలతో మాట్లాడాడట. మేము పెట్టిన ఆంక్షలు వల్ల ఉక్రెయిన్ నుండి మీకు సరఫరా అయ్యే గోధుమలు ఆగిపోయాయి. కాబట్టి బదులుగా మేమే మీకు గోధుమలు సప్లై చేస్తాం అని చెప్తున్నాడు పుతిన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి