రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన చూసిన తర్వాత ఇదే చాలామందిలో కన్ఫర్మ్ అయిపోయింది. ఇంతకీ పవన్ ఏమన్నారంటే ‘విడివిడిగా పోటీచేస్తే పనిచేయదు. విడివిడిగా పోటీచేస్తే ఒక దశాబ్దం, కుదిరితే రెండు దశాబ్దాలు కూడా వైసీపీనే కంటిన్యు అవుతుంది’. ఈ మాటలు చాలు జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ ఎంతగా భయపడుతున్నారో చెప్పటానికి. పైకేమో జగన్ కు పదేపదే వార్నింగులు ఇస్తుంటారు. లోలోపలేమో భయపడిపోతుంటారు. విడివిడిగా వెళితే ఇద్దరినీ కలిపి జగన్ చావకొడతాడని భయమే వీళ్ళని కలిపింది.





పవన్ దంతా మేకపోతు గాంభీర్యమే అని అందరికీ తెలిసిపోతోంది. జగన్ అంటే లోపల అంత భయం పెట్టుకుని పైకి మాత్రం తాను చాలా ధైర్యవంతుడినని ఫోజులు కొడుతుంటారు. జగన్ కు ఆరునెలలు మాత్రమే టైం ఇస్తున్నట్లు చెప్పారు. దేనికంటే తనను తాను జగన్ సెట్ రైట్ చేసుకోవటానికట. జగన్ కు వార్నింగులిస్తు ఏదేదో మాట్లాడేశారు. ఇంతకుముందు కూడా కొన్ని బహిరంగసభల్లో మాట్లాడుతు జనసేన విడిగా పోటీచేస్తే వీరమరణం తప్పదని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.





అంటే అప్పటినుండి ఇప్పటివరకు జనసేన పార్టీ ఏమాత్రం బలోపేతం అవలేదని  అర్ధమైపోతోంది. తాజాగా టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అంటే జగన్ను ఎదుర్కోవాలంటే చంద్రబాబునాయుడు-పవన్ ఒకళ్ళకి మరొకళ్ళు అండ అన్నమాట. ఇద్దరూ కూడబలుక్కుని ఒకళ్ళకి మరొకళ్ళు ధైర్యం చెప్పుకుంటారేమో. ఒకవిధంగా వైసీపీ, టీడీపీ, జనసేన మూడుపార్టీలకు రాబోయే ఎన్నికలు చాలా కీలకమనే చెప్పాలి.





వచ్చేఎన్నికల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ దాదాపు ఫేడవుటైపోవటం ఖాయమనే అందరు అనుకుంటున్నారు. తెలంగాణా పరిస్ధితి అయిపోతుంది ఏపీలో కూడా. చంద్రబాబు, లోకేష్ ఏపీలోకి రావటం కూడా చాలా అరుదైపోతుంది. అలాగే జనసేన ఇక ఉండదని అనుకోవాలి. పవన్ ఎంచక్కా సినిమాలు చేసుకుంటు హ్యాపీగా ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఇదే సమయంలో టీడీపీ+జనసేన  గెలిస్తే జగన్ కు ఇబ్బందులు తప్పవు. అయితే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైతే జగన్ కు కాస్త ఊరట దక్కే అవకాశముంది. అది ఎంపీ, ఎంఎల్ఏల సీట్లు గెలుచుకోవటంమీద ఆధారపడుంది.  లాజికల్ గా అయితే టీడీపీ+జనసేన అధికారంలోకి వచ్చే ఛాన్స్ తక్కువే. మరి ఎవరి అదృష్టం ఎలాగుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: