తొందరలోనే నారా బ్రాహ్మణి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు రెడీ అవుతున్నట్లు సమాచారం. సీనియర్ తమ్ముళ్ళంతా కలిసి బ్రాహ్మణిని ముందుపెట్టి రాష్ట్రంలో పర్యటనలు చేయాని ఒక సమావేశంలో నిర్ణయించారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టుతో పార్టీకి సారధ్యం వహించే ప్రత్యామ్నాయ నేత కనబడటంలేదు. చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చినా తమ్ముళ్ళెవరూ పెద్దగా సహకరించలేదు.




ఇదే సమయంలో నారా లోకేష్ మొదటి ఐదురోజులు రాజమండ్రిలోనే ఉండిపోయారు. ఇపుడు ఆరురోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. చంద్రబాబుకు మద్దతు కూడగట్టేందుకు లోకేష్ ఎంత ప్రయత్నిస్తున్నా ఉపయోగం కనబడటంలేదు. జాతీయ మీడియాలో కూడా పాజిటివ్ స్టోరీలు ఏమీ పెద్దగా కనబడలేదు. బీజేపీ పెద్దల అపాయిట్మెంట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. పెద్దలేమో లోకేష్ ను కలవటానికి ఇష్టపడటంలేదు. ఆరురోజులుగా లోకేష్ ఏమిచేస్తున్నాడో తెలీదు కానీ అవుట్ కమ్ అయితే పాజిటివ్ గా ఏమీ కనబడటంలేదు.





ఈ నేపధ్యంలోనే కొందరు సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ లోకేష్ తో జరిగిన చర్చలను చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియాతో చెప్పారు. చింతకాయల ఏమి చెప్పారంటే తొందరలోనే లోకేష్ కూడా అరెస్టు అవుతారనే విషయం చర్చకు వచ్చిందట. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు అరెస్టయి జైలులో ఉంటే పార్టీని ఎవరు నడిపిస్తారనే చర్చ జరిగిందట. అప్పుడు సీనియర్లు నారా బ్రాహ్మణిని ముందుపెట్టి తాము రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు ప్లాన్ చేస్తామని లోకేష్ కు భరోసా ఇచ్చారట. 





అందుకు లోకేష్ కూడా ఓకే చెప్పారట. చంద్రబాబునే అరెస్టు చేసిన జగన్మోహన్ రెడ్డి లోకేష్ ను మాత్రం ఎందుకు విడిచిపెడతారని లోకేష్ దగ్గరే తామంతా చర్చించుకున్నట్లు చెప్పారు. చింతకాయల చెప్పిందాని ప్రకారం తన అరెస్టు తప్పదని లోకేష్ కూడా మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. అరెస్టు నుండి తప్పించుకునేందుకేనా లోకేష్ వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నది అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి నిజంగానే బ్రాహ్మణి పర్యటనలు మొదలైతే జనాల స్పందన ఎలాగుంటుందనేది చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: