తొందరలోనే తెలంగాణా బీజేపీకి షాక్ తగలబోతోందట. ఏ రూపంలో అంటే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పటానికి డిసైడ్ అయినట్లు సమాచారం. బీజేపీకి గుడ్ బై చెప్పేసి తిరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవాలని అనుకున్నారట. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుండి పోటీచేయాలని రాజగోపాలరెడ్డి బాగా ఇంట్రస్టుగా ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. తమ్ముడి పార్టీ రీ ఎంట్రీపై అన్న, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే పార్టీ పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఎంపీగా టికెట్ ఇవ్వటానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే తన తమ్ముడు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నట్లు చెప్పారట. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాట్లాడిన తర్వాత ఏ సంగతి చెబుతామని పార్టీ పెద్దలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే కోమటిరెడ్డి తరపున ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అదేమిటంటే మహబూబ్ నగర్ కు నరేంద్రమోడీ వచ్చిన విషయం తెలిసిందే.
మోడీ పర్యటనలో రాజగోపాలరెడ్డి ఎక్కడా కనబడలేదు. మామూలుగా అయితే ప్రధానమంత్రి వచ్చినపుడు ఆయన దృష్టిలో పడటానికి నేతలు ఎగబడతారు. అలాంటిది రాజగోపాలరెడ్డి ఎయిర్ పోర్టులో కానీ తర్వాత మహబూబ్ నగర్ బహిరంగసభలో కానీ ఎక్కడా కనబడలేదు. మోడీ రాష్ట్రానికి వచ్చినా రాజగోపాల్ కనబడలేదంటనే అర్ధమైపోతోంది ఆయన ఆలోచన. పార్టీ మారటానికి రాజగోపాల్ అయితే డిసైడ్ అయినట్లే స్పష్టమవుతోంది. అందుకనే పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
కాకపోతే గ్రీన్ సిగ్నల్ రావాల్సింది కాంగ్రెస్ అధిష్టానం నుండే. ఆర్ధిక, అంగబలాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా గట్టిగా ఉన్నారు. ఒకవేళ రాజగోపాలరెడ్డి గనుక కాంగ్రెస్ లో చేరకపోతే భువనగిరి ఎంపీగా ఇంకెవరో పోటీచేస్తారు. ఆ విషయం వెంకటరెడ్డికి ఇష్టంలేదు. భువనగిరి ఎంపీ, మునుగోడు లేదా తాము పోటీచేయబో అసెంబ్లీ నియోజకవర్గాలు తమ కుటుంబంచేతిలో ఉండాలన్నది వెంకటరెడ్డి ఆలోచన. అందుకనే తమ్మడిని బీజేపీలో నుండి కాంగ్రెస్ లో నుండి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి