ఏపీ బీజేపీ అద్యక్షుడు దగ్గుబాటి పురందేశ్వరి అండ్ కో వైఖరి చాలా విచిత్రంగా ఉంది. తాజా ఎన్నికల ఫలితాల్లో ఉత్తరాధిలోని మూడు రాష్ట్రాల్లో గెలిచినందుకు, తెలంగాణాలో సంతృప్తికరమైన పలితాలు వచ్చినందుకు పండగ చేసుకున్నారు. ఫలితాలు మొదలైన  తర్వాత ఆదివారం మధ్యాహ్నం విజయవాడ పార్టీ ఆపీసు దగ్గర నానా రచ్చచేశారు. కారణం ఏమిటంటే జనాలంతా బీజేపీని ఆశీర్వదించారట. చత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో బీజేపీ గెలిచిందంటే అది ఆ పార్టీ లోకల్ లీడర్ల పోరాటాలు, వ్యూహాల ప్రతిఫలం మాత్రమే. 





నిజానికి ఈ ఎన్నికలు బీజేపీకి మిశ్రమ ఫలితాలనే ఇస్తుందని అంచనా వేశారు. ఎందుకంటే చత్తీస్ ఘడ్ లో మళ్ళీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని అనుకున్నారు. అలాగే మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం మీద జనాల్లో బాగా వ్యతిరేకత ఉన్న కారణంగా కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని అనుకున్నారు. రాజస్ధాన్ లో మాత్రమే కాంగ్రెస్-బీజేపీ గెలుపోటముల మధ్య హోరాహోరీ ఫైట్ తప్పదన్నారు. అయితే గెలుపు అవకాశం బీజేపీకే ఎక్కువగా ఉందని అంచనాలు వేశారు.





అయితే అనూహ్యంగా మూడు రాష్ట్రాల్లో బీజేపీనే గెలిచింది. మళ్ళీ అధికారం తమదే అని చత్తీస్ ఘర్ కాంగ్రెస్ నమ్మకానికి పూర్తి విరుద్ధంగా ఫలితాలు రావటాన్ని హస్తంపార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సరే ఫలితాలు ఏదైనా పై రాష్ట్రాల్లో బీజేపీ నేతల పోరాటాలు, గెలుపుకు అనుసరించిన వ్యూహాలే  ప్రధాన కారణమని చెప్పాలి. ఇక తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోలేదు. తమదే అధికారం అని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పుకున్నా అదంతా జరిగేది కాదని వాళ్ళకి తెలుసు.





అయితే మొన్నటివరకు మూడు ఎంఎల్ఏలుగా ఉన్న బీజేపీ బలం తాజా పలితాల తర్వాత ఎనిమిదికి పెరగటం సంతోషకరమనే చెప్పాలి. ఇక్కడ కూడా అభ్యర్ధుల పోరాటం తదితరాలు కలిసొచ్చాయి. మరి ఏపీ విషయం చూస్తే పురందేశ్వరి ఏమిచేస్తున్నారు ?  ఉత్తరాధి, తెలంగాణాలో వచ్చిన  ఫలితాలు ఏపీ బీజేపీకి ఏవిధంగాను ఉపయోగపడదు. తెలంగాణా బీజేపీ నేతలు ఇటు కేసీయార్ తో పాటు అటు కాంగ్రెస్ మీద కూడా పోరాటాలు చేశారు. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ప్రత్యర్ధి పార్టీలే  కాబట్టి. మరి ఏపీలో పురందేశ్వరి అలాగే పోరాటాలు చేస్తున్నారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: