రాజీనామా చేసిన దగ్గర నుండి చంద్రబాబునాయుడుపైన రాయపాటి రంగారావు మండిపోతున్నారు. తన తండ్రి, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును చంద్రబాబును అవమానించినట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను అడ్డంపెట్టుకుని పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు వందల కోట్ల రూపాయలు దోచేసుకున్నట్లు చెప్పారు. తమకు చంద్రబాబే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చారని చెప్పటం అబద్ధమన్నారు. రాష్ట్ర విభజనకు ముందే పోలవరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వంలోనే  తమకు ప్రాజెక్టు దక్కిందన్నారు.





తాము ఆస్తులను కుదవపెట్టి కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటే తమ దగ్గర నుండి చంద్రబాబు వందల కోట్ల రూపాయలను దోచుకున్నారని మండిపోయారు. ఎవరెవరికో సబ్ కాంట్రాక్టులను ఇవ్వాలని తమపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చి సాధించుకున్నట్లు చెప్పారు. తమతో పాటు వాళ్ళ దగ్గర కూడా చంద్రబాబు కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పారు. కానీ జనాల్లో తమ సంస్ధ గురించి మాత్రమే ప్రచారం జరిగిందన్నారు.





తాము పేరుకు మాత్రమే పోలవరం కాంట్రాక్టర్లమని కాని పనులన్నీ సబ్ కాంట్రాక్టులు తీసుకున్న చంద్రబాబు మనుషులు కంపెనీల చేతుల్లోనే ఉన్నాయన్నారు. వాళ్ళు పనులు చేయకపోతే తాము ఏమి చేయగలమని నిలదీశారు. ప్రతి సోమవారం పోలవారమని చెప్పి చంద్రబాబు చేసిన రివ్యూలన్నీ డబ్బులు దోచుకోవటానికే అన్న విషయాన్ని బయటపెట్టారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన విషయాలు, చంద్రబాబు దోపిడీని తాను ఎక్కడైనా సరే నిరూపిస్తానని చాలెంజ్ చేశారు. చంద్రబాబు మీద మండిపోవటమే కాకుండా మీడియా సమావేశంలోనే చంద్రబాబు ఫొటో తీసి నేలపైన కొట్టి పగలగొట్టారు.





అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే సత్తెనపల్లిలో రాయపాటి రంగారావుకు టికెట్ ఇవ్వటానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. తమ దగ్గర వందల కోట్ల రూపాయలు దోచుకున్న చంద్రబాబు ఇపుడు మోసం చేస్తున్నారని రంగారావు ఆరోపణలు మొదలుపెట్టారు. అందుకనే తెలుగుదేశంపార్టీకి రాజీనామా కూడా చేసేశారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది చూడాలి. రంగారావు మాటల్లో వైసీపీ వైపు  చూస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే వైసీపీలో చేరినా టికెట్ దక్కేది అనుమానంగానే ఉంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: