అలాగే నిరుద్యోగులకు డీఎస్సీ నోటిఫికేషన్ విషయం పైన కూడా క్లారిటీ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో వైసిపి గెలుపు లక్ష్యంగా ఆ వైపుగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే మెగా డీఎస్సీను కూడా నిర్వహించబోతున్నారు. ఈనెల 31న మంత్రులు ఆమోదం తెలిపినట్లు సమాచారం.. ఎన్నికలకు 70 రోజులలోనే ఉన్న సమయంలో నోటిఫికేషన్ ఇస్తారా లేదా అన్నట్లుగా నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పిఆర్సి రిపోర్టు కూడా IR విషయం పైన రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది..
అలాగే ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పంట రుణాల మాఫీ చేసే ఆలోచనలు ఏపీ సీఎం ఉన్నట్లు సమాచారం. ఈనెల 31న జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ రుణమాఫీ పైన పలు రకాల నిర్ణయాలు తీసుకొని అంశం ఉన్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇదే కనుక జరిగితే ఆంధ్రాలో ఉండే రైతుల ఓట్లన్నీ ycp ప్రభుత్వానికి పడతాయని రాజకీయ విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ కూడా ఆవైపు కాని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే మహిళలకు డ్వాక్రా రుణమాఫీ తో పాటు ఉచిత బస్సు అమలు పథకాన్ని కూడా మొదలు పెడితే కచ్చితంగా వీరి ఓట్లు కూడా తమకే పడే అవకాశం ఉన్నట్లు ఏపీ సీఎం భావిస్తున్నారు. మరీ మేనిఫెస్టో అంశం పైన రాష్ట్ర మంత్రివర్గం కూడా పాల్గొనబోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి