ఏ ప్రాంతంలోనైనా సరే ఎన్నికలు వచ్చాయంటే చాలు కచ్చితంగా నాయకులు ఓటర్లను ఆకట్టుకునే విధంగా పలు రకాల మేని పోస్టులను ప్రకటిస్తూ ఉంటారు. అధికారంలోకి వస్తే చాలు చాలామంది నేతలు అది చేస్తాం ఇది చేస్తామంటూ హామీలు చేసినప్పటికీ కొన్నిసార్లు ఆహామీలు ఎన్నికలలో చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. అందుకే మేనిఫెస్టోను అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఎన్నికలలో కారణం చేత ప్రధాన పార్టీలన్నీ కూడా ఎక్కువగా మేనిఫెస్టో పైన స్పెషల్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.


ప్రస్తుతం అధికారం పార్టీలో ఉన్న వైసీపీ కూడా మేనిఫెస్టోను ప్రకటించే విధంగా కసరత్తులు చేస్తోంది. గత ఎన్నికలలో నవరత్నాలు పేరుతో పలు రకాల పథకాలను ప్రకటించి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు జనాలలో విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు ఎన్నికలు మరొకసారి రాబోతున్న సమయంలో నవరత్నాలకు మించి హామీలను ఇచ్చే విధంగా మేని పోస్టును విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో ఎక్కువగా రైతులు, మహిళలు, వికలాంగులు, విద్యార్థులు, యువత, వృద్ధులు వంటి వారికే ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది.


ఫిబ్రవరి 18న అనంతపురం జిల్లాలో రాప్తాడు లో సిద్ధం సభ సందర్భంగా ఈ సభలో జగన్ మేనిఫెస్టోను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల తాము అధికారంలోకి వస్తే పెన్షన్ రూ .3000 పెంచుతామని ఇచ్చిన హామీను కూడా గడిచిన కొద్ది రోజుల క్రితం పెంచారు.. ఈసారి 4 వేలు పెంచుతామని హామీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో ఉండే 70 లక్షల మంది రైతులు రుణమాఫీలు చేయబోతున్నారని ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఎన్నికల ఇదే కచ్చితంగా బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని వైసిపి నాయకులు అనుకుంటున్నారు.అలాగే మహిళలకు మరింత కృషి చేస్తామని డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు తీసుకువస్తామని హామీ ఇవ్వబోతున్నారట. నిరుద్యోగులకు, యువతకు ఆకట్టుకునే విధంగా ప్రత్యేకమైన హామీలను ఇచ్చేందుకు వైసిపి మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: