గడిచిన కొన్ని గంటల క్రితం తెలుగుదేశం పార్టీ జనసేన సీట్ల పంపకాల వ్యవహారం ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి 24 నియోజవర్గాలలో సీట్లు ఇవ్వడంతో తల ఊపేసారని విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోందంటూ పలువురు రాజకీయ నేతలు కూడా తెలియజేస్తున్నారు. దీని వెనుక ప్యాకేజీ పనులు ఉండొచ్చేమో అని అనుమానాలు కూడా మళ్లీ తెరమీదకి వస్తున్నాయి.. ఎవరితో పొత్తు పెట్టుకోవాలో ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియని పరిస్థితులలో జనసేన పార్టీ ఉందంటూ పలువురు నాయకులు విమర్శిస్తున్నారు.


టిడిపి జనసేన ఉమ్మడి జాబితాలో విడుదల చేయడంతో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామనే భీమ అధికార పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని వార్తలైతే వినిపిస్తున్నాయి. చాలామంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టారు అర్థం కావడం లేదు అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అటు జనసేన నాయకులు కార్యకర్తలను కూడా చాలా మోసం చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం 50 నుంచి 60 సీట్లు అయిన తెచ్చుకోలేక పోతే ఎలా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఇక కేంద్రంలో చక్రం తిప్పుతానని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత అసలు కనిపించారంటూ వైసీపీ నాయకులు తెలియజేస్తున్నారు.. పైకి కనిపించని భయం వారిలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ వైఎస్సార్ సీపీ నాయకులు తెలుపుతున్నారు.. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు నాయుడు తన మేనీపోస్టులోని హామీలను సైతం నెరవేర్చలేదని ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నారు. కమిషన్లు కాంట్రాక్టుల కోసం పోలవరాన్ని నిలిపివేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని కూడా పణంగా పెట్టేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును నమ్మి మరొకసారి ప్రజలు ఓటు వేయరని విషయాన్ని గుర్తించాలని వైసీపీ నాయకులు తెలుపుతున్నారు. మరి వైసీపీ నేత కూడా మేనిఫెస్టో విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: