టిడిపి నుంచి 94 మంది అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. వారితో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించిన తర్వాత పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారట. వచ్చే 40 రోజులు చాలా కీలకంగా ఉండాలంటూ తెలియజేయడమే కాకుండా నిత్యం ప్రజలలో మమేకం అవుతూ ఉండాలని అలాగే పనితీరుపైన ప్రతి వారం కూడా సమీక్ష జరుపుతామంటూ తెలియజేశారు అభ్యర్థులు పనితీరు బాగా లేకపోతే టికెట్ ఇవ్వమంటూ కూడా తెలియజేశారు.. సీఎం జగన్ కు అసంతృప్తిగా ఉన్న వైపాక నేతలు ఎవరైనా వచ్చిన ఆహ్వానించాలంటూ సూచించారు.
ముఖ్యంగా జనసేన కేడర్ను కలుపుకొని ఎన్నికలలో ప్రచారం కొనసాగించాలని తీర్పునిచ్చారట.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులను చూసి చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రణాళికను చేపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. సీఎం జగన్ గెలవడానికి ఎన్నో క్లాస్ వేస్తూ ఉంటారని..టిడిపికి విభేదంగా ఉన్న ఉన్న టిడిపి నాయకులను సైతం కలుపుకొని ముందుకు వెళ్లాలని లేకపోతే వారంతా వైసిపివైపుగా వెళ్లే అవకాశం ఉందని సూచించారట. స్థానిక అంశాలతో పాటు ప్రత్యర్థి పార్టీ అయినా జరిగే నష్టం గురించి ప్రజలలో వివరించాలని సీనియర్లు అయినప్పటికీ ప్రజలలో ఉంటేనే సీటు ఇస్తానంటూ తేల్చి చెప్పేశారట. ప్రతి ఒక్కరు కూడా పొత్తులు సీట్ల సర్దుబాటు విషయంలో సహకరించాలంటూ సూచించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తారో అనే విషయాలను కూడా ప్రజలలో తీసుకువెళ్లాలని కూడా తెలియజేశారట. ఈసారి ఎన్నికలు మాత్రం చాలా రసవత్తంగా కనిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి