ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో టిడిపి పార్టీ భారీ మెజారిటీ తో గెలుపొందింది. దానితో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎంగా ఎంపిక అయ్యాడు . ఇక ఆ తర్వాత జరిగిన రెండవ అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి పార్టీ మెజారిటీని తెచ్చుకుంది. దానితో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు . ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 

దీనితో ఈసారి ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం కావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తన బలంతో పాటు జనసేన , బీజేపీ బలాలను కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. ఇక ఎలక్షన్ తేదీ కూడా విడుదల కావడంతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రచారాలను జోరుగా ముందుకు సాగిస్తున్నాడు. అలాగే అధికారంలోకి వస్తే తమ పార్టీ జనాలకు ఏ విధంగా మేలు చేస్తుందో తెలియజేస్తూనే... వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ప్రజలకు ఏన్నో ద్రోహాలను... మోసాలు చేసింది అని చెప్తూ వస్తున్నారు. 

ఇక తాజాగా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చాడు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పెన్షన్ ఇస్తామని అది కూడా ఇంటివద్దకే తెచ్చి అందిస్తామని వెల్లడించారు. అలాగే ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీయేనని మరియు ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా రక్షించామని తెలిపారు. ఇక మేము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ప్రజలకు ఎంతో మంచి చేశాము. మళ్లీ అధికారంలోకి వస్తే అంతకుమించిన మంచి చేస్తామని చంద్రబాబు తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: