-
Ananthapuram
-
Assembly
-
Bharatiya Janata Party
-
Bhuma Akhila Priya
-
Bhuma Brahmananda Reddy
-
CBN
-
Chintamaneni Prabhakar
-
choudary actor
-
Dharmavaram
-
Janasena
-
kadapa
-
Kamma
-
MLA
-
Nandyala
-
Parakala Prabhakar
-
paritala ravindra
-
Party
-
prabhakar
-
Raccha
-
Rayalaseema
-
Reddy
-
satya
-
soori
-
TDP
-
Telugu Desam Party
-
Tirupati
-
YCP
-
రాజీనామా
అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి కాదని... మరొక కమ్మ వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారు.. దీంతో అప్పటి నుంచి చౌదరి అనుచరులు నానా రచ్చ చేస్తున్నారు.. అనంతపురం అసెంబ్లీ సీటును ముస్లిమ్స్ కూడా ఆశించారు. గతంలో కూడా ఈ పార్టీ సీటును ముస్లింలకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి..ఇప్పుడు అటు ముస్లింలకు కాకుండా ఇటు ప్రభాకర్ చౌదరికి కాకుండా మరొక వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ రచ్చ మొదలైంది. దీంతో ఆయన కచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరొక నియోజకవర్గం ధర్మవరం.. అసెంబ్లీ నియోజకవర్గం లో కూడా రెబల్ బరిలో ఉన్నట్టుగా వినిపిస్తోంది. అక్కడి నుంచి బిజెపి నేత సత్యకుమార్ ను అభ్యర్థిగా ప్రకటించారు... ఇక్కడ వరదాపురం సూరి టికెట్ ఆశించినప్పటికీ.. వీరితోపాటు పరిటాల శ్రీరామ్ కూడా ఈ టికెట్ ఆశించారు. కానీ చివరికి సత్య కుమార్ ని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో వరదాపురం సూరి కూడా తెలుగుదేశం రెబల్ గా ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2009లో కూడా వరదాపురం సూరి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇప్పుడు బిజెపి పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట.
కళ్యాణదుర్గంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి అసమ్మతులు కొనసాగుతున్నాయి.. అక్కడ టికెట్ ఆశించిన ఇద్దరి నాయకులను కాదని మూడో అభ్యర్థికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు.. అయితే ఇప్పటికే ఒక అభ్యర్థి టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్లిపోయారు.. మిగిలి ఉన్నది కేవలం హనుమంతు రావు చౌదరి వర్గం.
కదిరిలో కూడా ఎమ్మెల్యే చాంద్ బాషా తెలుగుదేశం పార్టీ టికెట్లు ఆశించి చివరికి మళ్ళీ వైయస్సార్ పార్టీలో చేరారు..
ఇక తిరుపతి నియోజవర్గంలో టిడిపి పార్టీ పరిస్థితి మూడు వర్గాలు, ఆరు రచ్చలుగా కొనసాగుతోంది. జనసేన పార్టీకి ఇక్కడ టికెట్ కేటాయించడంతో అటు టిడిపి పార్టీ నేతలు.. కాపు నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. వైసిపి పార్టీ నుంచి మరో నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వ్యక్తిని తిరుపతి అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ అసమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వర్గాలు అక్కడ జనసేన నేతకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు.
కడప జిల్లా రైల్వే కోడూరులో కూడా జనసేన తరఫున అభ్యర్థిని ప్రకటించి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం మరొక అభ్యర్థిని ప్రకటించారు. ఇది కూటమి ఇమేజ్ను కూడా రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతీసేలా కనిపిస్తోంది. జనసేన పార్టీ.. టిడిపి పార్టీ ఎలా చెప్తే అలా ఆడుతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఏడాది క్రితమే డోన్ అసెంబ్లీ నియోజవర్గంలో ధర్మవరం సుబ్బారెడ్డిని ముందుగా అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు.. అయితే అవసరమైతే అక్కడ మార్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కూడా మరొకసారి రచ్చ రాజుకుంది. అక్కడి నుంచి గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన భూమా బ్రహ్మానందరెడ్డి టిడిపి పార్టీ పైన చాలా అసమ్మతిని తెలియజేస్తున్నారు.. అక్కడ సీనియర్ నేత ఫరూక్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనేమో బిజెపితో పొత్తు వల్ల ముస్లింల ఓట్లకు గండి పడుతుందనే ఆలోచనలో ఉన్నారు. దీంతో భూమా బ్రహ్మానందం రెడ్డి ఇప్పుడు అసంతృప్తిగా మారారు. దీంతో ఈయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు వ్యక్తమవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి