ఆంధ్రప్రదేశ్లోని పోలింగ్ గడువు దగ్గర పడుతుండడంతో గత కొద్దిరోజులుగా పలు రకాల సర్వేలు కూడా జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర జాతీయ స్థాయిలో సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. అయితే నిన్నటి రోజు నుంచి నాగన్న సర్వే ఆంధ్రాలో మరొకసారి కలకలం సృష్టించింది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందనే విషయం పైన ఇప్పటివరకు చాలా సర్వే సంస్థలు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మక్కువ చూపుతున్నాయి. అయితే ఇప్పుడు నాగన్న సర్వే కూడా వైసిపి పార్టీ గెలుస్తుంది అంటూ తెలియజేస్తోంది.


అయితే సర్వేలో 175 స్థానాలలో వైఎస్ఆర్సిపి 103 స్థానాలను గెలుస్తుందని,  39 స్థానాలలో టిడిపి గెలుస్తుందని.. మిగిలిన 33 సీట్లలో వైఎస్ఆర్సిపి, కూటమి మధ్య చాలా హోరాహోరీగా పోటీ నడుస్తుందంటూ వెల్లడించారు .. అయితే ఇందులో కూడా 20 నుంచి 25 సీట్లు వైయస్సార్సీపీకే వస్తాయంటూ వెల్లడించారు. అయితే ఈ సర్వే ను కూటమి పార్టీ తిప్పి కొడుతోంది. తాజాగా నాగన్న సర్వేలో తెలుస్తున్న అంశం ఏమిటంటే..ఇందులో టిడిపి పార్టీకి సామాజిక వర్గాల వారీగా పర్సంటేజ్ విషయానికి వస్తే..

Tdp

1).Bc -46.59%
2).chirstian -41.45%
3).muslim -41.24%
4).Oc -51.82%
5).sc -43.63%
6). st -45.43%


Ycp:

1).Bc -52.28%
2).chirstian -57.26%
3).muslim -56.42%
4).Oc -47.17%
5).sc -55.83%
6). st -52.44%

ఇక మిగిలిన కాంగ్రెస్ పార్టీకి మొత్తం మీద 1.92 శాతం మాత్రమే ఉన్నది.. టిడిపి , వైసిపి పార్టీ మధ్య క్యాస్ట్ వైస్ గా పర్సంటేజ్ చూస్తే కేవలం ఓసి లో ఉండేవారు మాత్రమే టిడిపికి అత్యధికంగా ఓటు వేస్తున్నారు. వైసిపి పార్టీకి మిగిలిన అన్ని వర్గాల కులాల వారు దాదాపుగా 50 శాతం పైగా ఓటు వేస్తున్నారు. ఈ ఓటు బ్యాంకు అటు వైసీపీ పార్టీకి కాస్త ప్లస్ గా మారేలా కనిపిస్తోంది. అయితే ఇదంతా కులాల వారీగా ఇస్తున్నటువంటి పర్సంటేజ్ మాత్రమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఓసి మినహాయించి మిగతా కులాల వారు వైసిపికి మొగ్గు చూపడానికి కారణం ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: