అగ్ర రాజ్యం అమెరిగా అధ్యక్షుడు ఊహించిందే నిజం అయింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధం ప్రారంభించింది. డ్రాన్లతో అటాక్ చేసింది. దీంతో ఇజ్రాయెల్ కూడా తిప్పికొట్టేందుకు  సిద్ధం అయింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో భారత్ తో పాటు ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు ఇరాన్, ఇజ్రాయెల్ లోని తమ రాయభార కార్యాలయాలను అప్రమత్తం చేశాయి.


కాగా ఈ యుద్ధంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో యద్ధం కారణంగా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భారత్ తెలిపింది. తక్షణమే ఇరు పక్షాలు వెనక్కి తగ్గాలని సంయమనం పాటించాలని సూచించింది. మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో యూకే కూడా అప్రమత్తమైంది. దాడులను నిరోధించడానికి ఎయిర్ ఫొర్స్, ఎయిర్ రీప్యూయలింగ్ ట్యాంకర్లను సిద్ధం చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బోల్లా గ్రూపు ఇజ్రాయెల్ రక్షణ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించింది.


ఇదిలా ఉండగా యుద్ధం మొదలు పెట్టిన ఇరాన్.. అగ్రరాజ్యం అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. యూఎన్వో చార్టర్ లో ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి మొదలు పెట్టినట్లు ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఇరాన్ ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు.


ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ వైపు ఇరాన్ వదిలిన డ్రోన్లు, మిస్సైల్స్ దూసుకొస్తున్నాయి. సుమారు 200 లకు పైగా డ్రోన్లు, మిస్సైల్స్ ఇరాన్ ప్రయోగించింది. మరోవైపు వాటిని తట్టుకునేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఆకాశంలో వరుసగా మిస్సైల్స్ ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ సైరగ్ మోగించి తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. 95 శాతం ఇరాన్‌ మిస్సైల్స్‌ కూల్చివేశామని ఇజ్రాయెల్‌ చెబుతోంది. మొత్తం మీద మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: