ఆయన తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. ప్రత్యర్థి పార్టీ నేతలు ఎంతటి వారైనా గట్టి కౌంటర్ ఇచ్చి ముచ్చెమటలు పట్టించే వాక్చాతుర్యం ఆయన సొంతం. ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. ఇక ఆయన ప్రసంగాలు ఇస్తుంటే యువత మొత్తం మైమరిచిపోతుంటుంది. ఆయన అందరిలా రికమండేడ్ కాదు సెల్ఫ్ మేడడ్ ఆయన ఎవరో కాదు ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి.


 మండల స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే మహా నాయకుడిగా ఎదిగాడు. ఇక ఇప్పుడు ఇండియాలోనే స్టార్ లీడర్గా మారిపోయాడు. ఆయనకి అందరిలా బ్యాక్ గ్రౌండ్ ఎవరూ లేరు. తాతలు తండ్రుల వారసత్వాలను అందిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడు కాదు. సొంతంగా అది కూడా పార్టీని నమ్ముకొని కాదు తనను తాను నమ్ముకుని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఇక ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు రేవంత్ రెడ్డి. రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు ఏబీవీపీ లో చేరాడు.


 ఒక విద్యార్థుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంలో ఎంతో ముందుండేవాడు. హైదరాబాద్ వచ్చి సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ స్థాపించాడు. కొన్నాళ్లకే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో దిగాడు. 1992లో 24 సంవత్సరాల వయసులోనే గీతను ప్రేమ వివాహం చేసుకున్నాడు రేవంత్. ఇకచదువుకునే సమయంలోనే విద్యార్థి నాయకుడిగా ఉన్న రేవంత్.. పెళ్లి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారూ. బిఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.


 కల్వకుర్తి నియోజకవర్గం నుండి పార్టీ నుంచి టికెట్ ఆశించిన నిరాశే ఎదురయింది. 2006 స్థానిక ఎన్నికల్లో మిడ్చల్ మండల జడ్పిటిసి టికెట్ ఆశించిన రాకపోవడంతో బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇక ఇండిపెండెంట్గా ఘనవిజయాన్ని అందుకున్నాడు  2008లో స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు  రేవంత్ చరిష్మాను అర్థం చేసుకున్న చంద్రబాబు టిడిపిలోకి ఆహ్వానించగా 2009లో సైకిల్ పార్టీలోకి వెళ్లారు.


 ఇక 2009 పర్సన్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పార్టీ తరఫున కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎప్పుడు ప్రజల్లో నిలుస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు. 2014 ఎన్నికల్లో మరోసారి కొడంగల్ టిడిపి నుంచి పోటీ చేసి అప్పుడు ఫామ్ లో ఉన్న బిఆర్ఎస్ ఫై విజయం సాధించారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ పట్టు విడవని విక్రమార్కుడిల మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇక కనుమరుగవుతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీకీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టి ఇక తెలంగాణలో లేకుండా పోతుంది అనుకున్న పార్టీని అధికారంలోకి తెచ్చి మాస్ లీడర్ కాదు ఊర మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇలా పార్టీని నమ్ముకుని కాదు మొదటి నుంచి తనను తాను నమ్ముకుని ముందుకు సాగిన రేవంత్ ఇక ఎప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: