•అక్క ద్వారా ప్లాన్ వర్క్ అవుట్ చేసిన బండారు శ్రావణి

•ఆ బెదిరింపులే బండారు శ్రావణి కి వరం

•టిడిపి 100% విక్టరీ ఖాయం


(రాయలసీమ - శింగనమల -ఇండియా హెరాల్డ్.)

మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే.. ఇక ప్రతి ఒక్కరు జూన్ 4 ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ తాము అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని లెక్కలు వేసినా ప్రజలు కొంతమందికే తమ సానుభూతి తెలియజేస్తున్నారు.. అలాంటివారిలో రాయలసీమ శింగనమల నియోజకవర్గం కూడా ఒకటి..  గతంలో టిడిపికి కంచుకోటగా ఉన్న శింగనమల గత సారి ఎన్నికలలో జొన్నలగడ్డ పద్మావతి 40, 000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.  అయితే ఈసారి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు వైసిపి తరఫున బరిలోకి దిగారు..

మరొకవైపు బండారు శ్రావణి టిడిపి తరఫున రంగంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే హోరాహోరీగా పోటీ జరిగింది.. అయితే ఈసారి ఇక్కడ ఎక్కువగా అవకాశాలు టిడిపికే కనిపిస్తున్నాయి. టిడిపి 100% విక్టరీ అంటూ అప్పుడే లెక్కలు తేలుతున్నాయని చెప్పాలి.. నిజానికి అంతకుముందు ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణి .. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని భారీ ప్లాన్ వేసింది..  ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈమె ప్లాన్ వర్కౌట్ అయిందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి..  ఒకవైపు ఓడిపోయిందనే సింపతి ప్రజలలో ఎక్కువగా ఉండడం.  మరొకవైపు అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగులు వేసి చూపిస్తానని వాగ్దానం చేయడం ఈ రెండు ఈమెకు కలిసొచ్చాయి..

అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ప్రచారంలో భాగంగా తనకు వడదెబ్బ తగిలి పడిపోతే .. ప్రజలలో మళ్లీ తిరిగి గుర్తింపు తెచ్చుకోవడానికి తన అక్కను బరిలోకి దింపి తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తామో కూడా తన ఆశయాలను తన అక్క ద్వారా నెరవేర్చుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఆశయాలకు ఫలితం చేకూరింది అని సమాచారం చాలామంది ఈమెపై సింపతి చూపించి ఈమకే ఓటు వేశారని తెలుస్తోంది . మొత్తానికైతే సింగనమల మళ్ళీ టీడీపీ కంచుకోటగా మారిపోతుందని ఇక్కడ టిడిపి 100% విక్టరీ సాధించబోతుందని సమాచారం.. ఏది ఏమైనా ఈసారి బండారు శ్రావణి ప్లాన్ వర్కౌట్ అయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి
ఇక్కడ బండారు శ్రావణి కి కలిసొచ్చే మరో అంశం కూడా ఉంది.. అదేమిటంటే వైసీపీ నాయకులు టిడిపిలో చేరడంతో కొంతమంది వైసిపి బడా నేతలు అలా చేరిన వారిని బెదిరిస్తున్నారు.. ఇలాంటివన్నీ చూసిన ప్రత్యక్ష ఓటర్లు ఈసారి వైసీపీను తప్పించి టిడిపిని నిలబెట్టాలని చూస్తున్నారు.. మొత్తానికి అయితే బండారు శ్రావణి విజయం సాధించడం ఖాయమని నూటికి నూరు శాతం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: