రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పీకే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రెండు నెలల ముందు వరకు కూడా ఈ ఎన్నికలలో వైసిపి గెలవడం అసాధ్యం అంటూ కూటమికి అనుకూలంగా ఎన్నో సందర్భాలలో మాట్లాడారు ప్రశాంత్ కిషోర్.. అయితే తాజాగా తన నిజ స్వరూపం ఏంటో లైవ్ లో తేలిపోయినట్లు తెలుస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ కు ప్రశాంత్ కిషోర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.. ఇందులోనే పీకే గురించి పలు ప్రశ్నలు వేయడం జరిగింది.


ముఖ్యంగా కరణ్ థాపర్ ప్రశాంత్ కిషోర్ తో మీ అంచనాలు గతంలో విఫలమయ్యాయి అని చెబుతూ హిమాచల్ ప్రదేశ్ ,తెలంగాణ ఫలితాలను ఎగ్జాంపుల్ గా చూపించారు.. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోతుందని తెలంగాణలో బిఆర్ఎస్ వస్తుందని గతంలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయాలను కరణ్ థాపర్ గుర్తు చేయగా.. అందుకు పీకే మొదటి నేను ఎక్కడ అన్నాను చూపించండి అంటూ అడగక కరణ్ థాపర్ లైవ్ లోనే ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ను సైతం  చూపించడంతో షాక్ అయ్యారు పీకే.


అయితే ఆ సమయంలో ఏం చేయని స్థితిలో ప్రశాంత్ కిషోర్ కోపంగా ఊగి పోతూ మీరు జర్నలిస్టు కాదు అంటూ ఫైర్ అయ్యారు.. ఏపీ విషయంలో సైతం ప్రశాంత్ కిషోర్ అంచనాలు  తప్పుతాయన దానికి ఇదే ఉదాహరణ అన్నట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ కేవలం టిడిపితో ప్యాకేజ్ మాట్లాడుకుని ఇలా అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని విషయాలను బయటపెట్టారు. గత ఐదేళ్లలో ఎప్పుడూ మాట్లాడని ప్రశాంత కిషోర్ గత రెండు మూడు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన టిడిపి పార్టీ పైన ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఒక ఎయిర్పోర్టులో ప్రశాంత్ కిషోర్ లోకేష్ కలిసినప్పటి నుంచి ఇలాంటి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో మరొకసారి ప్రశాంత్ కిషోర్ కొన్ని పార్టీలకే కొమ్ము కాస్తున్నారు అనే విధంగా కనిపిస్తోంది. మరి జూన్ 4న ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: