మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సారి జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలక పార్టీలు అయినటువంటి తెలుగు దేశం , జనసేన , బీజేపీ మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఈ పొత్తు టీడీపీ , జనసేన తో పాటు బీజేపీ కి కూడా బాగా కలిసి వచ్చినట్లు కనబడుతుంది. పోయిన సారి ఎన్నికలలో బీజేపీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా ఊపు లేదు. కానీ ఎప్పుడూ అయితే తెలుగు దేశం , జనసేన తో పొత్తు అయ్యిందో అప్పటి నుండి ఈ పార్టీ కి కూడా మంచి క్రేజ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఏర్పడింది.

ఈ సారి 400 పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీజేపీ చాలా రోజులుగా పని చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ పార్టీ ఏ రాష్ట్రాలలో అయితే వీక్ గా ఉందో ఆ రాష్ట్రాలలో స్ట్రాంగ్ గా ఉన్న ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగింది. దాని ద్వారా వీరికి నేరుగా 400 ఎంపీ స్థానాలు రాకపోయినా వారి కూటమితో కలిపి అయినా వస్తాయి అని వారు భావిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కి చాలా కలిసి వచ్చే అంశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా హహ్లోడి సత్తా బజార్ అనే ఒక సంస్థ నివేదిక ప్రకారం భారతీయ జనతా పార్టీ 400 పార్లమెంట్ స్థానాల కంటే ఎక్కువ సాధిస్తుంది అని , మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈజీగా కూటమి 18 స్థానాలను దక్కించుకుంటుంది అని చెప్పుకొచ్చింది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి 18 పార్లమెంటు స్థానాలను కనుక దక్కించుకున్నట్లు అయితే బీజేపీ కి తెలుగు దేశం , జనసేన తో పొత్తు భారీగా కలిసి వచ్చినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap