ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలలో విజయాన్ని అందుకుంది. దీంతో కచ్చితంగా వైసీపీ నేతలు విదేశాలకు వెళ్ళిపోయి తలదాచుకుంటారని జగన్ కూడా భయపడతారనే విధంగా టిడిపి నేతలు మాట్లాడడం జరిగింది. కానీ వీటన్నిటిని దీటుగా ఎదుర్కొని ప్రస్తుతం పార్టీ విస్తృతస్థాయి సమావేశాలలో జగన్ మాట్లాడడం జరిగింది. అలాగే యాత్రను కూడా కొనసాగిస్తానని కూడా మాట ఇచ్చారు. తాజాగా ఈ రోజున మంత్రివర్గ సమావేశంలో జగన్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.


జగన్ మాట్లాడుతూ కేవలం ఇప్పుడు ఇంటర్వ్యూ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటూ నేతలు శ్రేణులలో ఉత్సాహం నింపేయాల మాట్లాడారు.. శకుని పాచికలనే సబ్జెక్టు కేవలం ఇంటర్వెల్ మాత్రమే శ్రీకృష్ణుడు తోడు ఉన్నా కూడా పాండవులు ఓడిపోయారు.. కాలం సాగుతున్న కొద్ది హనీమూన్ పీరియడ్ కూడా ముగుస్తుందంటూ వెల్లడించారు. ఓడిపోయామనే భావన మనసులో నుంచి ముందు తీసేయండి అంటూ తమ నేతలకు తెలియజేశారు.. మనం న్యాయంగా ధర్మంగా ఓడిపోలేదని వెల్లడించారు.


చెప్పిన పని చేశాము కాబట్టే ప్రజల మధ్య గౌరవంగా ముందుకు వెళుతున్నాము  మనం తలెత్తుకునేలా రాజకీయాలు చేసాము ప్రతి ఒక్కడు ఒక అర్జునుడుగా మారి తిరిగి విజయాన్ని సాధించాలని ఎన్నికల ఫలితాల పైన చాలామంది ఫీడ్బ్యాక్ తీసుకున్నామని వెల్లడించారు జగన్ .అవన్నీ కూడా తన దృష్టికి వస్తున్నాయని కార్యకర్తలకు అండగా ఉండండి నేను వచ్చి కార్యకర్తలను త్వరలోనే కలుస్తానని కూడా జగన్ వెల్లడించారు. ప్రస్తుతం జగన్ తమ నేతలతో మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి.


కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలు సైతం మూకుమ్మడిగా ఓట్లు చీలకుండా ఓటు ట్రాన్స్ఫర్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అయితే ప్రజలు కూడా మేనిఫెస్టోలో ప్రకటించిన వాటికి మక్కువ చూపి ఓటు వేశారనే విధంగా టిడిపి నేతలు తెలియజేస్తున్నారు. మరి చెప్పినవన్నీ చేస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: