•ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. రద్దయినా ఉపయోగం లేదే..

•రద్దు చేసిన రీ సర్వే క్యాన్సిల్ చేయరా..

•జగన్ చేసిన తప్పే బాబు చేస్తున్నారా..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పద్ధతిని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూ తాము అధికారంలోకి వస్తే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మపలికారు. అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి అయ్యారు.. చెప్పినట్టుగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు కానీ దీనివల్ల ఏం ప్రయోజనం కలిగింది.. రీ సర్వేలు రద్దుచేసి ఎవరి భూములు వారికి ఇవ్వాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రచారంలో భాగంగా తెగ ప్రచారాలు నిర్వహించారు.. కానీ అధికారంలోకి వచ్చాక ఈ విషయంపై ఆయన నోరు మెదపడం లేదు..

మరొకవైపు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరిట సీఎం జగన్ పేద ప్రజల భూములను అక్రమంగా కాజేస్తున్నారని ఆరోపించారు.. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించి భయాందోళనలకు గురి చేశారు.. కొత్త చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతాయని తమకు తెలియకుండానే వేరే వ్యక్తుల తమ భూములను కాజేసే అవకాశం ఉందని.. ఇలా లేనిపోని అబాండాలు అపోహలను సృష్టించారు.. కానీ చంద్రబాబు ఎట్టకేలకు అధికారంలోకి వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు..  కానీ ఇప్పటివరకు రీ సర్వే క్యాన్సిల్ చేయలేదు..


పాత డేటా కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వైసిపి హయాంలో జరిగిన సర్వేలను అలాగే ఉంచేసి.. అందులో జరిగిన అవకతవకలు ,మోసాలను టిడిపి నేతలే నాడు బయటపెట్టి..నేడు అన్ని విషయాలు తెలిసిన వారే ఇంకా సైలెంట్ గానే ఉండడంతో   అసలు ఏం జరుగుతోంది అనే ఆందోళనలో ఉన్నారు ప్రజలు. ఇక వారి హయాంలో జరిగింది ఇప్పుడు వీరి హయాంలో కూడా జరుగుతుంది.. మరి ప్రజలకు ఎక్కడ న్యాయం జరగలేదు కదా.. కనీసం పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్నాయి.నలుగురు ఎంపీ లు ఉంటే కనీసం వీరైన ప్రజల కోసం అండగా నిలవాలని... ప్రస్తుతం ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపి ప్రజలకు అన్ని విధాల మంచి చేకూరేలా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు... మరి గత ప్రభుత్వాన్ని ఈ విషయంపై విమర్శించిన వారు మరి ఇప్పటికీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపడం లేదు.. ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: