అయినప్పటికీ కుక్క తోక వంకర అన్న విధంగా చైనా తీరు ఎప్పుడు ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అటు చైనాకు బుద్ధి చెప్పేందుకు అటు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎంతో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తూ ఉంటుంది. చైనాకు ఏ దేశమైతే శత్రుదేశం గా కొనసాగుతూ ఉంటుందో.. ఇక అలాంటి దేశాలతోనే సంబంధాలను మరింత మెరుగుపరుచుకుంటూ.. ఇక మిత్ర సంబంధం కొనసాగిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే చైనాకు పొరుగు దేశమైన వియత్నాంతో కూడా ఇక ఇప్పుడు భారత్ ఇలాంటి వ్యూహాత్మకమైన సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఇక ఇటీవల మోదీ వేసిన వ్యూహంతో చైనాకి బిగ్ షాక్ తగిలింది.
వ్యూహాత్మక సంబంధాలను విస్తరించే దిశగా.. ముందుకు సాగుతున్న ప్రధానీ నరేంద్ర మోడీ ఇటీవల చైనా ఆటలకు చెక్ పెట్టేందుకు వియత్నంతో కొత్త సంబంధాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఈ రెండు దేశాల మధ్య ఏకంగా ఆరు అవగాహన ఒప్పందాలు జరిగాయి అన్నది తెలుస్తుంది. ఇటీవలే వియత్నం ప్రధాని భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలో నరేంద్ర మోడీతో గురువారం భేటీ అయ్యారు ఆయన. కాగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక చర్యలను ఉద్దేశిస్తూ భారత్ అభివృద్ధికి మాత్రమే సహకరిస్తుంది విస్తరణ వాదానికి కాదు అని మోడీ ఈ సమావేశంలో తేల్చి చెప్పారట. వియత్నాం సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు.. వియత్నాంకు 30 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు మోదీ హామీ ఇచ్చారట. ఇలా వియత్నాం ను మచ్చిక చేసుకోవడం ద్వారా చైనాకు చెక్ పెట్టాలని వ్యూహాన్ని పన్నారు మోడీ.