గత ప్రభుత్వం మొత్తం వ్యవస్థలను నాశనం చేశారని కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క లేకుండా ఖర్చు చేశారని.. దీంతో కేంద్రం ఏపీ వద్ద డబ్బులు లెక్కలేనని ఉన్నాయనీ అనుకుంటోంది అంటూ సీఎం చంద్రబాబు తెలియజేశారు. ప్రస్తుతం ఏపీలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు లేవని తెలియజేశారు. అయితే ఇది ఉద్యోగస్తులకు ఒక బాంబ్ లాగానే పేలింది. ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలి అంటూ తెలియజేశారు.అలాగే అమరావతి రాజధానిని ప్రపంచ బ్యాంకు నిధులే అవసరం ఉండదు అంటూ గత ప్రభుత్వం రాసి ఇచ్చిందని పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఇతర వాటికి వాడేసుకున్నారంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి వాటి వల్లే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బంది పడుతోందని..కేవలం 100 రోజుల పాలనలోనే ఎన్నో ఇబ్బందులను వరదలను ఎదుర్కొన్నామంటూ తెలుపుతున్నారు. అయినప్పటికీ కూడా ఏపీ ప్రజలకు మంచి చేయాలని తపనతో కష్టపడుతున్నానంటూ తెలిపారు ఎవరైనా చెడ్డ చేయాలనుకుంటే మాత్రం ఎవరిని వదలనని పోరాడుతూ ఉంటానని తెలిపారు. అమరావతి రాజధాని నీట మునిగిపోయిందనే విధంగా ప్రచారం చేస్తున్నారు.. వీరి పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జీతాలు లేవని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది మరో 10 రోజులలో ఉద్యోగస్తులతో పాటు పెన్షన్లకు , ప్రభుత్వ పెన్షనర్లకు కొన్ని కోట్ల రూపాయలు చెల్లించాలి మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు ఏం చేస్తారన్నది చర్చనీ అంశంగా మారింది.