పహల్ గామ్ అటాక్ జరిగాక భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది.ఈ మెరుపు దాడిలో ఎంతోమంది ప్రజలు చనిపోయారు అంటూ పాకిస్తాన్ మీడియా ప్రచారం చేసినప్పటికీ మేం పాకిస్తాన్ ప్రజలను టార్గెట్ చేయలేదని,కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే మెరుపు దాడులు చేశామని చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారంటే.. భారత దేశానికి ఈ గతి పట్టడానికి కారణం గాంధీ చూపిన అహింసా మార్గమే.శాంతి, అహింస అంటూ భారత్ కూర్చుండడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి.. కాశ్మీరీ పండిట్లను చంపడం నుండి ఈ మారణ హోమం మొదలైంది. 

భారతదేశంలో ఎక్కడ ఏ బాంబు పేలినా కూడా దాని మూలాలు పాకిస్తాన్లోనే ఉంటాయి. చివరికి హైదరాబాదులో బాంబు దాడులు జరిగిన కూడా ఆ పేరు పాకిస్తాన్ కి సంబంధించిన వారిదై ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పోషిస్తూ మన దేశంలో జరిగే అనర్థాలకు కారణమవుతుంది. పాక్ ఉగ్రవాదులు చేసే చర్యలు సహించలేకే మోది ప్రభుత్వం ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం పట్ల అయినా సరే మేం మా పూర్తి మద్దతు తెలుపుతాము. భారతదేశంలో దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వెంటనే వారిని పై చర్యలు తీసుకుంటారు.సోషల్ మీడియాలో పిచ్చి కూతలు రాయకండి అని,ఒకవేళ రాస్తే ఆ పరిణామం మరోలా ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

జాతీయ సమగ్రతకు,దేశభద్రతకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే ఎవరైనా సరే సెలబ్రిటీలైనా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లయినా వదిలిపెట్టేది లేదు. సామాజిక మాధ్యమాల్లో పిచ్చికుక్కలు మొరిగినట్టు ఏది పడితే అది రాయకండి. ఉగ్రవాదులు చేసిన పనికి ప్రతి చర్యలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల పిచ్చికూతలు కూస్తే మాత్రం బాగుండదు అంటూ సోషల్ మీడియాలో పిచ్చికూతలు కూసే వారిపై పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్లు చేశారు.అలాగే గాంధీ మార్గంలో నడవడం వల్లే భారత్ కి ఈ గతి పట్టింది అని మాట్లాడడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: