కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు అక్రమం గా ఎం తో మంది అమాయక పైన భారతీయుల ప్రాణాలను తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇలా భారత్ కి చెందిన అమాయకపు ప్రజలను బలి తీసుకున్న కారణం తో భారత్ ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాదు లపై పెద్ద ఎత్తున దాడి చేసే అనేక మంది ప్రాణాలను తీసిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక దీనితో పాకిస్థాన్ కూడా తిరిగి భారత్ పై దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది . ఇలా భారత్ - పాక్ మధ్య భారీ ఎత్తున వార్ జరిగే అవకాశాలు కనబడుతూ ఉండడం తో భారత్ లో జరుగుతున్న అనేక కార్యక్రమాలను నిలిపివేస్తూ వస్తున్నారు.

అందులో భాగంగా హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలు కూడా సజావుగా జరుగుతాయా లేదా అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. హైదరాబాదు లో రేపటి నుండి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇక ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధాలు జరిగే అవకాశాలు భారీ ఎత్తున కనబడుతూ ఉండడంతో హైదరాబాదు లో ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు సజావుగా జరుగుతాయా లేదా అని అనుమానాలు చాలా మందిలో నెలకొన్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతూ ఉండగా , అందాల పోటీలో పాల్గొనే విదేశీ ప్రతినిధులకు  ,ఇటు సామాన్యులకు భద్రత కల్పించడం అత్యంత సవాలుగా మారింది. మూడు వారాల పాటు మిస్ వరల్డ్ పోటీలు జరగనుండడంతో అప్పటివరకు అన్ని సజావుగా కొనసాగేలా చూడడం అత్యంత ఆవశ్యకం.

అయితే పోటీల కొనసాగింపుపై కేంద్రం సూచన ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలు సజావుగా జరుగుతాయా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: